సంచలనాల రాంగోపాల్ వర్మ తీసే సినిమాల్లో ఎంత సీరియస్ నెస్ ఉంటుందో? అప్పుడప్పుడు ఎదుటవారి మనోభావాలతో సంబంధం లేకుండా ఆ మనోభావాల ఆధారంగా చేసుకుని అవలీలగా సినిమాలు చేసేస్తాడు. ఆయనకి సమాజంలో వ్యక్తులతో పనిలేదు. వర్మకి కావాల్సిందల్లా ఓ బర్నీంగ్ ఇష్యూ. అదీ కుదరకపోతే పేరున్న వ్యక్తులు. ప్రస్తుతం వర్మ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి `మర్డర్` టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు. మిర్యాలగూడ ఘటన ఆధారంగా దీన్నీ రూపొందిస్తున్నాడు. ప్రణయ్- అమృత ప్రేమ..అటుపై ప్రణయ్ దారుణ హత్యకు గురైన ఉదంతాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అమృత వర్మని ఓ గడ్డిపోచలా తీసిపారేసింది. సినిమాకు సంబంధించిన ఆ పోస్టర్లు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని సెటైరికల్ గా స్పందించింది. అంటే? అమృత దృష్టిలో వర్మకున్న స్థానం అది అని ఓ క్లారిటీ వచ్చింది. ఇక `పవర్ స్టార్` టైటిల్ తో మరో సినిమా కూడా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేసి ఈ సినిమా చేస్తున్నాడని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లను బట్టి తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ని ఎలా ఫోకస్ చేయాలనుకున్నాడో? అలా చేస్తూ మానసిక ఆనందాన్నైతే పొందుతున్నాడు వర్మ.
ఇంత చేస్తున్నా వర్మ గురించి ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీ ఇప్పటివరకూ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఫైర్ బ్రాండ్ మెగా బ్రదర్ నాగబాబు కూడా ఎందుకనో మౌనంగా ఉన్నాడు. మెగా ఫ్యామిలీని ఏమైనా అంటే…అందులోనూ పవన్ కళ్యాణ్ ని ఏదైనా అంటే? అస్సలు ఊరుకోడు. కానీ వర్మ విషయంలో ఆ ఫైర్ బ్రాండ్ సైలెంట్ గానే ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ఇలాంటి విషయాల్ని పట్టించుకోరు. కొంత మంది గురించి మాట్లాడి అనవసరంగా వాళ్ల విలువ పెంచకూడదని మాట్లాడే వ్యక్తి చిరు. ఇలా ఆ వేవ్ లో వర్మ జారిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ దృష్టికి కి ఈ పోస్టర్లు వెళ్లాయట. వాటిని చూసి ఆయన కూడా చిన్న నవ్వు నవ్వుకుని వదిలేసారుట. అంటే మెగా ఫ్యామిలీ దృష్టిలో వర్మ వెంట్రుకతో సమానం అన్నట్లేగా! అన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.