మెగాబ్రదర్ నాగబాబుకు కోపమొచ్చింది. మీడియా అతిపై ఏకి పారేశారు. గత కొన్ని రోజులుగా చైనాని కరోనా వైరస్ వణికిస్తోంది. అక్కడి ప్రజల్లో భీతావాహ వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే దీని బారిన పడిన 300 పైచిలుకు మంది మృత్యు వాత పడ్డారని, మరి కొంత మందికి ఈ వ్యాధి సోకిందని వరుస కథనాలు వస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ రెడ్ అలర్ట్ ప్రకటించాయి.
చైనా నుంచి ఏవరు ఇతర దేశాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆరోగ్య పరీక్షలు చేసిన తరువాతే విమానాశ్రయం నుంచి బయటికి వదులుతున్నారు. ఇండియాలోనూ ఇదే పరిస్థితి. అయితే కరోనా వైరస్ తీవ్రత ఏమోగానీ మీడియాకు మాత్రం కరోనా వైరస్ భయంకరంగా పాకేసిందని, పబ్లిక్ రంటే మీడియాకు అత్యంత వేగంగా కరోనా వైరస్ పాకుతోందని, 90 శాంత మీడియాకు ఇప్పటికే వైరస్ సోకిందని నాగబాబు సంచలన పోస్ట్ పెట్టారు.
ఇది సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. ఉన్నట్టుండి మెగా బ్రదర్‌కు మీడియా అంటే అంత కక్ష ఎందుకు మొదలైందో అర్థం కావడం లేదని, ఇది మంచి పద్దతి కాదని మీడియా వర్గాలు నాగబాబుపై ఫైర్ అవుతున్నాయి. నాగబాబు మాత్రం ఇదంతా తనకు పట్టనట్టు ఆ ట్వీట్‌ని డెలీట్ చేయడం లేదు. మీడియాకు సమాధానం కూడా చెప్పడం లేదు.