టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. ఈ హీరోపై వచ్చిన పెళ్లి వార్తలు ఏ హీరోపై ఇంత వరకు రాలేదేమో. కొన్ని నెలలు భీమవరం అమ్మాయితో ప్రభాస్ పెళ్లి జరగబోతోందని వార్తలు షికారు చేశాయి. ఆ తరువాత అనుష్క – ప్రభాస్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదరడం, ప్రభాస్ తన 3 ఏఎమ్ ఫ్రెండ్ అని అనుష్క చెప్పడంతో త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
ఈ వార్తలపై అనుష్క క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ నాకు మంచి మిత్రుడని చెప్పడంతో ఆ తరువాత నుంచి మెగా డాటర్ కొణిదెల నిహారికని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడని మరో వార్త పుట్టుకొచ్చింది. లాక్‌డౌన్ నేపథ్యంలో నిహారిక ఇన్ స్టా వేదికగా ఫ్యాన్స్‌తో లైవ్‌లో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ప్రభాస్‌తో డేటింగ్‌లో వున్నావని, పెళ్లి చేసుకోబోతున్నావని వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా అని ఓ అభిమాని ప్రశ్నించాడు. అది పుకారే నని నిహారిక తేల్చి పారేసింది.
ఈ నేపథ్యంలో పెళ్లి పుకార్లపై విసుగెత్తిన ప్రభాస్ తాజాగా స్పందించాడు. `నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లిపై విముఖంగా లేను. అయితే అది ఎప్పుడు రుగుతుందన్నది మాత్రం చెప్పలేను` అని షాకిచ్చాడు. పనిలో పనిగా మీడియాపై సెటైర్ వేశాడు. మా ఫ్యామిలీ కంటే నా పెళ్లి గురించి మీడియానే ఎక్కువగా ఆసక్తి చూపిస్తోందని ప్రభాస్ పంచ్ వేయడం ఆసక్తికరంగా మారింది.