మా వార్: రాజ‌శేఖ‌ర్ పై చిరు ఫైర్‌

మూవీ ఆర్టిస్ట్‌ అసిసోయేషన్‌ (మా)లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. `మా` డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ వేదికపై `మా`లో నెలకొన్న విభేదాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. గత కొద్ది రోజులుగా మా అసోషియేషన్‌ అధ్యక్షుడు నరేష్‌, ఉపాద్యక్షుడు, కార్యదర్శి రాజశేఖర్‌, జీవితల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎందుకోగాని ఈ సారి ఎల‌క్ష‌న్స్‌లో గెలిచిన‌ప్ప‌టి నుంచి కూడా వాళ్ళ‌లో వాళ్ళ‌కు స‌ఖ్య‌త కుద‌ర‌డం లేదు.

అయితే మా డైరీ వేదికగా ఈ వివాదం మరోసారి బయటపడింది. డైరీ ఆవిష్కరణ తరువాత మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి అసోషియేషన్‌లో గొడవలన్ని మర్చిపోయి అంతా కలిసి పనిచేయాలని సూచించారు. మంచి మైకులో చెప్పండి.. చేడు చెవిలో చెప్పండి అంటూ అసోషియేషన్‌ సభ్యులకు హితవు పలికారు. అయితే చిరంజీవి మాట్లాడుతున్నంతసేపు ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డ రాజశేఖర్‌, తరువాత వ్యాఖ్యాత పరుచూరి గోపాలకృష్ణ చేతిలో మైకు లాక్కుని మ‌రి ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌సాగారు.

`మా` కారణంగా తన ఫ్యామిలో ఎన్నో గొడవలు జరుగున్నాయంటూ కామెంట్‌ చేశాడు. తన కారు ప్రమాధానికి కూడా మాలో జరుగుతున్న వివాదాలే కారణమన్నారు. చిరు అందరూ కలిసి ఉండాలని చాలా బాగా చెప్పారు కానీ అది సాధ్యం కాదన్నారు. రాజశేఖర్‌ మాట్లాడుతున్న సమయంలో ఆయన్ను వారించేందుకు చిరు, మోహన్‌బాబు, కృష్ణంరాజు ప్రయత్నించినా రాజశేఖర్‌ అది పట్టించుకోకుండా తాను చెప్పాల్సింది చెప్పారు.

మా అసోషియేషన్‌లో గ్రూపులు ఫాం అయినట్టుగా చెప్పిన రాజశేఖర్, కొంత మంది తెర‌వ‌ర‌కే హీరోల‌ని నిజ జీవితంలో ఒక‌వేళ ఎవ‌ర‌న్నా నిజ‌జీవితంలో మంచి చేసినా వారిని తొక్కేస్తున్నార‌న్నారు. మాలో అంతా సవ్యంగా లేదని చాలా తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే రాజశేఖర తీరుపై వేదిక మీద ఉన్న పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కార్య‌క్ర‌మంలో అలా మాట్లాడ‌టం ఎవ్వ‌రికీ న‌చ్చ‌లేదు. అటు వేదిక మీద పెద్ద‌లు ఒకేసారి రాజ‌శేఖ‌ర్ మాట‌ల‌కు ఖంగుతిన్నారు. చిరు ఎంతో చ‌క్క‌గా గొడవల గురించి పబ్లిక్‌గా చర్చించ వద్దని చెప్పినా వినకుండా రాజశేఖర్‌ వేదిక మీద మాట్లాడటం సరికాదన్నారు. ఆయ‌న కావాల‌నే ఈ కార్య‌క్ర‌మానికి గొడ‌వ పెట్టేందుకు వ‌చ్చిన‌ట్లు అనిపించింద‌ని చిరు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.