‘విద్య వాసుల అహం'(వివాహం) సెట్స్‌లో జీవిత, రాజశేఖర్ సందడి*

Jeevitha Rajashekar

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఎటర్నిటి ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతోన్న సినిమా ‘విద్య వాసుల అహం'(వివాహం). ‘తెల్లవారితే గురువారం’ సినిమా తర్వాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ మరియు టైటిల్, యానిమేషన్ కాన్సెప్ట్ వీడియోను వినాయక చవితి స్పెషల్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటికి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌‌ను శివాని రాజశేఖర్ తల్లిదండ్రులైన జీవిత, రాజశేఖర్ సందర్శించారు. షూటింగ్ జరుగుతున్న తీరుకి ఈ సినిమా కాన్సెప్ట్ కి వాళ్ళు ఎంతో సంతోషించారు. ఈ సినిమా తన కుమార్తెకే కాకుండా టీమ్ మొత్తానికి విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందని, మంచి కంటెంట్‌తో వస్తున్న ఇటువంటి చిత్రాలకు ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో బ్రహ్మరధం పడుతున్నారని పేర్కొన్నారు.

పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో లతో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. కల్యాణి మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విద్య వాసుల అహం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.

నటీనటులు:

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్

సాంకేతిక నిపుణులు:

చిత్రం: విద్య వాసుల అహం

బ్యానర్: ఎటర్నిటి ఎంటర్టైన్మెంట్

సంగీతం: కల్యాణి మాలిక్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేష్ దత్త మోటూరు

సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి

రచన: వెంకటేష్ రౌతు

ఎడిటర్: సత్య గిడుటూరి

నిర్మాత: లక్ష్మీ నవ్య మోటూరు & రంజిత్ కుమార్ కొడాలి

దర్శకత్వం: మణికాంత్ గెల్లి