మా లో ఉండాలంటే భజన చెయ్యలా…?

అస‌లు మా ప్రెస్‌మీట్లు, అందులో ఉండేవాళ్ల మాట‌లు, వాళ్ల సమావేశాలు చూస్తుంటే నిజంగా ఇండ‌స్ట్రీ కోసం వాళ్ళు ఏం చేశార‌న్నది క‌నిపించ‌డం లేదు. ఎంతో మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు ఇండ‌స్ట్రీని న‌మ్ముకుని వ‌చ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ‌కి అవ‌కాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు ఇలాంటి స‌మ‌స్య‌ల పై ఫోక‌స్ చేయ‌కుండా వీళ్ళ‌లో వీళ్ళు తిట్టుకోవ‌డ‌మే స‌రిపోతుంది. కాస్తో కూస్తో ఆలోచిస్తే గ‌త బోర్డులు ఓకే ఈ బోర్డు మ‌రీ దారుణంగా అయితే భ‌జ‌న‌లు చేసుకోవ‌డం లేదా… ఒక‌రిని ఒక‌రు తిట్టుకోవ‌డం ఇదే ముఖ్య‌మైన ప‌నిగా పెట్టుకుంది. లోలోప‌ల వాళ్ళ‌కి ఉండే ఇన్న‌ర్ ఫీలింగ్స్ అన్నీ బ‌య‌ట పెడుతున్నారు.

తాను చెప్పిన మాటకు విలువ లేకుండా పోయిందని మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి తన ఆవేదనను వ్యక్తం చేశారు. రాజశేఖర్ విమర్శల తరువాత, మరోసారి మైక్ తీసుకున్న ఆయన, “నేను ఇందాక చెప్పిన మాటలకు విలువే ఇవ్వలేదు. మంచి వుంటే మైక్ లో చెప్పండి, చెడు వుంటే చెవిలో చెప్పుకుందామని అన్నాను. అది గౌరవం ఇవ్వలేని వారికి… నిజంగా ఇక్కడ ఎందుకు ఉండాలి? పెద్దలుగా మేమంతా ఎందుకు ఉండాలి? ఎందుకు ఇలా రసాభాస చేయడం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం ఎలా ఉంటుంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే” అని చిరంజీవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఆ సమయంలో మరోసారి కల్పించుకున్న రాజశేఖర్, తాను నిజాన్ని మాత్రమే మాట్లాడానని, తాను ఎవరి ముందూ తలవంచుకుని ఉండబోనని చెబుతూ స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం ముందుగా పక్కా ప్రణాళిక వేసుకుని వచ్చి చేశారని, కార్యక్రమాన్ని పాడు చేసే ఉద్దేశం వారిలో స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డ చిరంజీవి, అటువంటి వారికి సమాధానం చెప్పబోనని, మాలోని క్రమశిక్షణా కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు