టాలీవుడ్ ఆడియన్స్ సాయిపల్లవి పెర్ఫార్మెన్స్‌కి ‘ఫిదా’ అయిపోయారు. ఈ భామను దర్శకుడు శేఖర్ కమ్ముల ఓవర్‌నైట్‌లో స్టార్ ని చేసేశారు. సాయి నుంచి మళ్లీ అలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ‘ఫిదా’ తరువాత చేసిన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సక్సెస్ నాని అకౌంట్‌లోకి వెళ్లిపోయింది. రెండేళ్ల క్రితం శర్వాతో చేసిన ‘పడి పడి లేచెమనసు..’ సాయి కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. సో, తన కెరీర్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తెస్తాయన్న ఆశలు ఉన్న రెండు సినిమాలపైనే పెట్టుకుంది.
అందులో ఒకటి రానా దగ్గుబాటితో చేస్తున్న ‘విరాటపర్వం’, రెండోది నాగచైతన్యతో చేస్తోన్న ‘లవ్‌స్టోరీ’. ఈ రెండు సినిమాలే సాయి చేతిలోవున్నాయి. ఈ రెండూ వేసవికి వస్తున్న చిత్రాలే కావడంతో వీటిపైనే పెద్ద ఆశలు పెట్టుకుంది సాయిపల్లవి. విరాటపర్వం, లవ్‌స్టోరీ రెండూ ఒకింత అంచనాలున్న సినిమాలే కనుక ఏది వర్కౌటైనా సాయిపల్లవి కెరీర్‌కు మళ్లీ ఊపురావడం ఖాయం.
ప్రేమ కథలను మ్యాజిక్ చేసి చూపించగల దర్శకుడు శేఖర్ కమ్ముల చేస్తోన్న లవ్ స్టోరీపైనే సాయిపల్లవి ఎక్కువ నమ్మకంతో ఉందట. అయితే.. ఈ ‘లవ్‌స్టోరీ’ సినిమా నాగచైతన్యకే తప్ప సాయిపల్లవికి ఈ మాత్రం ఉపయోగపడదని టాలీవుడ్ సినీ పెద్దలు చెబుతున్నారు. అలాగే రానా దగ్గుబాటితో చేస్తున్న ‘విరాటపర్వం’ కూడా ఆమె కెరీర్ కు ఉపయోగపడే చిత్రం కాదని తెలుస్తోంది! అదీ సంగతీ!? ప్చ్.. సాయిపల్లవి!?