హీరోయిన్ తమన్నా కు కథానాయికగా 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేసింది.
ఇంత కాలం తరువాత ఇప్పుడు మలయాళ పరిశ్రమకి తొలి పరిచయం కాబోతున్నారు.
తొలి ప్రయత్నంతోనే ప్రేక్షకులను భయపెడతానంటున్నారు. ‘సెంట్రల్ జైలిలే ప్రేతం’ (‘సెంట్రల్ జైల్‌లో దెయ్యం’ అని తెలుగు అర్థం) అనే హారర్ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్నారు తమన్నా. కథ మొత్తం ఓ సెంట్రల్ జైల్, అందులో ఉండే దెయ్యాల చుట్టూ తిరుగుతుందట.
ఇంతకీ తనను దెయ్యం రూపంలో మలయాళ ప్రేక్షకులు చూస్తారో? చూడరో? అనే సందేహం వెంటాడుతుందట!