స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 20వ చిత్రం `పుష్ప అనూహ్యంగా పాన్ ఇండియా రేంజు అన్న ప్రకటన కాస్త ఆశ్చర్యపరిచేదే అయినా అది బన్నీ డ్రీమ్.. సుక్కూ డ్రీమ్ కూడా. పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టాలన్న పంతంతోనే ఈ మూవీ కాన్సెప్టుని డిజైన్ చేశారు. పాన్ ఇండియా ఆలోచన తర్వాతనే అసలు సన్నివేశం మారిపోయింది. ఈ ప్రాజెక్టుకు హీరో దర్శకులే బలం అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా సన్నివేశం తారుమారైంది. సుక్కు అన్ని భాషల నటులను రంగంలోకి దించేస్తూ ఒక్కసారిగా పాన్ ఇండియా హీట్ పెంచేశాడు. బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ని గానీ… సునీల్ శెట్టిని గాని మెయిన్ విలన్ గా ఎంపిక చేయాలని చూస్తున్నాడు. ఇక కోలీవుడ్ నుంచి మరో ముఖ్యమైన నెగిటివ్ రోల్ కు విజయ్ సేతుపతిని ఎంపిక చేయడం ఇంతలోనే సేతుపతి ఎగ్జిట్ అవ్వడం వేడెక్కించింది.
అయితే అతడి ఎగ్జిట్ కి కారణం ఏమిటా? అన్నది ఆరా తీస్తే పలు ఆసక్తికర సంగతులే తెలిశాయి. ఇందులో విజయ్ రోల్ టూమచ్ నెగిటివ్ గా ఉంటుందని… ఫారెస్ట్ నేపథ్యంలో సాగే స్టోరీ కావడం.. అందులోనూ మరీ రగ్గడ్ గా ఉండే పాత్రను డిజైన్ చేయడం తన కెరీర్ విషయంలో ప్రతికూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందనే భయంతో తప్పుకున్నట్లు ఓ రీజన్ వినిపిస్తోంది. అలాగే సుకుమార్ కథను పాత్రను వినిపంచినప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదని…కేవలం తెలుగు సహా ఓవర్సీస్ కే పరిమితమవుతుందని అన్నారుట. అలాగే మరో ప్రధాన కారణం కూడా లీకైంది.
పక్క భాషలో క్రేజీ మూవీలో విలన్ గా నటిస్తే కోలీవుడ్ లో హీరోగా తన కెరీర్ కి ముప్పు ఉంటుందని…భాషా బేధం కూడా తలెత్తే అవకాశం ఉంటుందని సేతుపతి భావిస్తున్నారట. అందుకే వద్దనుకున్నాడని చెప్పుతున్నారు. అయితే విజయ్ ఇప్పటికే టాలీవుడ్ లో ఉప్పెన సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. కానీ ఆ సినిమా ఇక్కడికే పరిమితం. మరి విజయ్ `పుష్ప` లాంటి క్రేజీ మూవీని వదిలేయడానికి అసలు కారణాలు ఇవేనా? లేక బయటకు చెప్పుకోలేనవి ఇంకేవైనా ఉన్నాయా? అన్నది తెలియాల్సింది ఉంది.
