నటుడు బ్రహ్మాజీ హీరోయిన్‌ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అంతటా లాక్ డౌన్ విధించారు. మన దేశంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీని కారణంగా షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో రోజు వారి సినీ కార్మికులు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొండున్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో చిరంజీవి చైర్మన్‌గా ఓ చారిటీని ఇటీవల ఏర్పాటు చేశారు. దీనికి తన వంతు బాధ్యతగా మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఆ వెంటనే నాగార్జున మరో కోటి సినీ కార్మికుల కోసం విరాళం ప్రకటించారు. ప్రభాస్ 50 లక్షలు అందిస్తానని ముందుకొచ్చారు. నాని 30 లక్షలు, ఎన్టీఆర్ 25 లక్షలు, వరుణ్‌తేజ్ 20 లక్షలు, రవితేజ 20 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష, బ్రహ్మాజీ 75 వేలు ప్రకటించారు.
దగ్గుబాటి ఫ్యామిలీ కోటి. రామ్‌చరణ్ 30 లక్షలు, మహేష్ 25 లక్షలు, నాగచైతన్య 25 లక్షలు, వరుణ్‌తేజ్ 20 లక్షలు, విశ్వక్‌సేన్ 5 లక్షలు, కార్తికేయ 2 లక్షలు, శర్వానంద్ 15 లక్షలు, దిల్ రాజు శిరీష్ 10 లక్షలు ప్రకటించారు. అయితే హీరోయిన్స్ నుంచి లావణ్య తప్ప ఎవరూ ప్రకటించలేదు. దీంతో అసహనానికి గురైన బ్రహ్మాజీ వారిపై విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.