వాట్సాప్ గ్రూపుల్లో వరుస వార్తల్ని సర్క్యూలేట్ చేసుకుంటూ జనం పానిక్ అవుతున్న వేళ రోమ్ నగరం తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు రామ్‌గోపాల్ వర్మ ట్వీట్‌లు చేస్తూ వైరల్ అవుతున్నారు. ఈ పానిక్ సిట్యువేషన్‌ని కూడా తన పబ్లిసిటీకి వాడేసుకుంటున్నాడు. కరోనా వైరస్‌పై గత కొన్ని రోజులుగా వరుస ట్వీట్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వర్మ తాజాగా మరో ట్వీటేశారు.
కరోనా కారణంగా అంతా సెల్ఫ్ ఐసోలేషన్‌లో వుండిపోయారని, పైళ్లైన జంటలైతే విడాకుల కోసం ఎదురుచూస్తున్నారని కామెంట్‌లు చేసి ఎంజాయ్ చేసిన వర్మ తాజాగా `బాహుబలి 2`ని టార్గెట్ చేశాడు. కాలిఫోర్నియాలోని ఓ షాపింగ్ మాల్ ముందు నిత్యవసరాల కోసం ప్రజలు క్యూలో నిల్చున్న వీడియోని షేర్ చేసిన వర్మ దర్శకుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి -2` క్యూ లైన్లని కరోనా అదిగమించిందని ఫన్నీగా ట్వీట్ చేశాడు. తాజాగా `షోలే` సినిమా పోస్టర్‌లో టైటిల్‌ని `థోలే` అంటూ మార్చి పోస్టర్‌లో వున్న అమితాబ్, ధర్మేంద్ర, హేమా మాలినిలకు మాస్కులు మార్ఫింగ్ చేసి ఇకపై ఇలాంటి పోస్టర్‌లని చూడాల్సి వస్తుందేమే అని పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
కరోనా వైరస్ విళయతాండవ చేస్తున్న వేళ అమెరికాతో పాటు యావత్ ప్రంచ వ్యాప్తంగా జనవితం స్థంభించిపోయింది. మాల్స్, స్కూల్స్, కాలేజ్‌లు ప్రపంచ వ్యాప్తంగా మూతపడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం బోసిపోయింది.