బన్నీ-సుకుమార్ చిత్రం వచ్చే నెల ప్రారంభం

అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కలయికలో వచ్చిన రెండు చిత్రాలు – ఆర్య, ఆర్య 2 . ఈ రెండు చిత్రాలు చాలా పెద్ద విజయం సాధించాయి. ఆ చిత్రం బృందంలోని అందరికీ పెద్ద బ్రేక్ నిచ్చాయి ఈ రెండు సినిమాలు. కానీ ఆ తరువాత మళ్ళీ బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో సినిమా కుదరలేదు. బన్నీ అభిమానులు మాత్రం వీరి కలయికలో సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఈ నేపధ్యంలో బన్నీ అభిమానులకు శుభవార్త. ఈ కలయికలో సినిమా వచ్చే నెల 3 న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇక 20 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సుకుమార్ ఈ సినిమా కోసం అద్భుతమైన కథ సిద్ధం చేసాడట. అంతకు ముందు రెండు సినిమాలను మించేలా ఈ సినిమా ఉంటుందట. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

ప్రస్తుతం బన్నీ ‘అల వైకుంఠపురములో’ అనే చిత్రంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.