Pushpa Movie Song: ‘పుష్ప’ నుంచి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

Pushpa Movie Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ” పుష్ప” సినిమా సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ” ఆర్య ” ,” ఆర్య 2″ ‘పుష్ప ‘ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను.. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మార్చేశారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ స్టైల్ ను, గ్లామర్ ని పక్కకు పెట్టి.. అతనిలోని టాలెంట్ ను బయటికి తీశారు సుక్కు. పుష్ప ది రైజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17వ తేదీన విడుదలై.. ఇప్పటికీ బాక్సఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ లో పాత రికార్డులను మొత్తం చెరిపేసి.. కొత్త రికార్డులను సృష్టించే దిశగా పుష్పరాజ్ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టిన ఈ సినిమా.. కేరళతో పాటు.. బీ టౌన్ లోనూ భారీ వసూళ్లు రాబట్టింది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలోని ‘దాక్కో దాక్కో మేక’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల అయ్యింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ అడవిలో పోలీసులను ఎదురించే టైం లో ఈ సాంగ్ వస్తుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను మహాలింగం పాడాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.

YouTube video player