ఫ్యాన్స్‌కి `వ‌కీల్‌ సాబ్` నిర్మాత అలా షాకిచ్చారు

ప‌వ‌న్ ..ర‌వితే.. స‌త్య‌దేవ్.. శ్రీ‌విష్ణు తాజా టిట్ బిట్స్

టాలీవుడ్ టాప్ 4 లేటెస్ట్ అప్ డేట్స్ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. వీటిలో ఒక‌టి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ్యాట‌ర్ అయితే మ‌రొక‌టి మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు సంబంధించిన‌వి. అలానే యువ హీరో శ్రీ‌విష్ణు .. రైజింగ్ హీరో స‌త్య‌దేవ్ గురించిన స‌మాచారం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఓసారి అస‌లు మ్యాట‌ర్స్ లోకి వెళితే..

*ప్ర‌స్తుతం షూటింగ్ లు స్టార్ట్ చేసే పరిస్థితి లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ టెన్ష‌న్ లో ఉన్నార‌ట‌. అందుకే ఇక‌ ఎందుకు ఇలా ఫాన్స్ ని వెయిట్ చేయించడం, ఆశ చూపించడం..! ఆగష్టు నెలాఖరున వకీల్ సాబ్ షూటింగ్ ముగించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు అట..! ఇదే ఇన్ఫో ఫాన్స్ కి చెప్పాల్సింది గా పవన్ ఫాన్స్ ప్రెసిడెంట్ కి దిల్ రాజు అండ్ టీం ఒక మెసేజ్ ఇచ్చార‌ట‌.

*కన్నడంలో హిట్ట‌యిన‌ మూవీ `లవ్ మాక్ టైల్` తెలుగు రీమేక్ కి తాజాగా సన్నాహాలు చేస్తున్నారు. హీరోగా సత్య దేవ్ నటిస్తుండ‌గా.. హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. లవ్ మాక్ టైల్ చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని తెలుస్తోంది.

* త‌న‌కు అచ్చొచ్చిన హ్యూమ‌ర్ అలానే ఎమోష‌న్ డ్రామాని వ‌దిలేసి.. యువ‌హీరో శ్రీ‌విష్ణు మ‌రో ప్ర‌యోగం చేస్తున్నాడ‌ట‌. క‌మర్షియ‌ల్ స్క్రిప్టుతో ప్ర‌యోగం చేసిన‌ ప్ర‌తిసారీ శ్రీ విష్ణు బోల్తా ప‌డ్డాడు..! గ‌త‌ మూవీ తిప్ప‌రా మీసం అడ్ర‌స్ లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో హ్యూమ‌ర్ బేస్ డ్ స్టోరీలో న‌టిస్తున్నాడు. బైలింగ్వ‌ల్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్లుగా నివేధా థామ‌స్, నివేధా పేథురాజుల‌ను హీరోయిన్లుగా తీసుకుంటున్న‌ట్లుగా స‌మాచారం. ఆ ఇద్ద‌రూ బ్రోచేవారెవురా నాయిక‌లు అన్న సంగ‌తి తెలిసిందే.

* అలాగే మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన `క్రాక్` ఓటీటీలో రిలీజైపోతోంది అంటూ ప్ర‌చారం సాగుతోంది. కానీ ఈ ప్ర‌చారం నిజం కాద‌ని నిర్మాత ఠాగూర్ మ‌ధు వివ‌ర‌ణ ఇచ్చారు.