రవిబాబు ఇంతలా అమ్మాయిలను వేధిస్తాడా?
తెలుగు పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలు తక్కువ అని, అసలు లేవని కొందరు మీడియాలో చెప్తూంటారు. కానీ కానీ తాను ఎదుర్కొన్నానంటూ ఓ ఐటం సాంగ్ ఆర్టిస్ట్, క్యారక్టర్ ఆర్టిస్ట్ వెల్లడించింది. అంతేకాక ప్రముఖ దర్శకుడు రవిబాబు లైంగికంగా వేధిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. శిరీషా అనే ఈ ఐటమ్ సాంగ్ ఆర్టిస్ట్ యాభైకి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటమ్ గర్ల్‌గా నటించింది. తను ప్రక్కలోకి రాలేదని, దర్శకుడు రవిబాబు సినిమా అవకాశాలు రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ వాపోయింది శిరీష.
ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ…తాను తనకు సినీ ఇండస్ట్రీలో అన్యాయం జరిగిందని, కళామ తల్లినే నమ్ముకున్న తన పరిస్థితి ఈ రోజు చాలా అద్వాన్న స్థితిలో ఉందని చెప్పుకొచ్చింది శిరీష. అలాగే డైరెక్టర్ రవిబాబుపై సంచలన ఆరోపణలు గుప్పిస్తోంది శిరీష. తాను ఈ వేషాలు, అవకాశాలు రాని దారుణమైన స్థితిలో ఉండటానికి రవిబాబు మాత్రమే కారణమని, తనకు రవిబాబు అన్యాయం చేయడమే గాక అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నాడని ఆమె ఆరోపించింది.
ఇక రవిబాబుని అందరూ క్రియేటివ్ డైరెక్టర్ అంటారు. కానీ నా విషయంలో అది తప్పు. తను నాతో ఎంత దారుణంగా మాట్లాడాడో మీకు తెలియదు.. నీ రేటు ఎంత? అని కూడా అడిగాడు. నేను ‘నువ్విలా’ అనే చిత్రంలో రవిబాబుతో పని చేశాను. ఆయన క్యారెక్టర్ నాకు తెలుసు. ఫోన్ చేసి రావే ** అంటాడు. అంటూ రవిబాబుపై ఆరోపణలు గుప్పించింది శిరీష.
ఈ విషయంలో తనకు ఎవ్వరూ సహకారం అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది శిరీష. తనని ఇండస్ట్రీ పట్టించుకోవడంలేదని…. తినడానికి తిండిలేక పచ్చడి మెతుకులతో బతుకుతున్నా ను అని.. దర్శకులు నిర్మాతల పక్కల్లోకి అయితే మేం వెళ్లాలి. సినిమా ఆఫర్స్ మాత్రం ఇతర ఇండస్ట్రీ వాళ్లకు ఇస్తున్నారు.