Bhoomika: భూమిక..ఉత్తరాధిన స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్‌తో ఆమె నటించిన సినిమా ఖుషి. ఆ మూవీ విజయం సాధించడంతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రజలను మెప్పించింది. ఆ తర్వాత యోగా టీచర్ భరత్ ఠాగూర్‌ను పెళ్లి చేసుకుని కొంత కాలం వరకు సినిమాలకు దూరంగా ఉంది.
ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిట్‌మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయనే నిర్మాతలతో ఎప్పుడూ టచ్‌లో ఉండాలనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
ఎన్నో ఏళ్ల నుంచీ తాను ఇండస్ట్రీలో ఉన్నానని తనను ఎవరూ, ఎపుడూ కమిట్‌మెంట్ అడగలేదని ఆమె స్పష్టం చేశారు. ఒక పాత్రకు తాను సరిపోతానని అనిపిస్తే దర్శక, నిర్మాతలు తన దగ్గరికే వచ్చి తనతో మాట్లాడేవారని ఆమె చెప్పారు. పరిశ్రమలో ఎంతోమంది క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నామన్న వ్యాఖ్యలకు ఆమె విరుద్ధంగా మాట్లాడడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.ప్రస్తుతం ఈమె పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.