ప‌వ‌న్ ఫ్యాన్ క్రేజ్ ని కొట్టేద్దామ‌నే!

ప‌వ‌న్ ఫ్యాన్ క్రేజ్ ని కొట్టేద్దామ‌నే!

తెలుగు రాష్ర్టాల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ స్టార్ గా…జ‌న‌సేన అధినేత‌గా కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న స్టార్. ఓ సినిమా స్టార్ క‌న్నా సామాజిక సేవ‌తో అభిమానుల గుండెల్లో దైవ స‌మానుడైన ఏకైక స్టార్. సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ కున్న ఫాలోయింగ్ గురించి వివ‌ర‌ణ అస‌వ‌రం లేని స్టార్. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి హీరోయిన్ల‌ను..హీరోల‌ను అడిగితే ఎలాంటి రియాక్ష‌న్స్ వ‌స్తాయో కూడా చెప్పాల్సినంస‌రం లేదు.

తాజాగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ని ప‌వ‌న్ అభిమానులు అత‌ని గురించి ఒక్క ముక్క‌లో చెప్పాలంటే! ఫ్యాన్స్ కు పున‌కం వ‌చ్చేలా చెల‌రేగిపోయింది. ప‌వ‌న్ తెలుగు సినిమాకిచ్చిన ఓ గిప్ట్. అత‌ని గురించి చెప్ప‌డం ఎవ‌రికి సాధ్యం. అంత‌కు మించి ఇంకే చెప్ప‌గ‌ల‌నంటూ బ‌ధులిచ్చింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు నిధిని పొగ‌డ్త‌లతో ముంచేస్తున్నారు. టాలీవుడ్ లో మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని దీవించేయ‌డం మొదులు పెట్టారు. కొద్ది రోజులుగా ప‌వ‌న్ గురించి ఇలాంటి వ్యాఖ్య‌లు లేక‌పోవ‌డంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

క‌త్తి మ‌హేష్‌..శ్రీరెడ్డి లాంటి వాళ్లు అప్పుడ‌ప్పుడు వాగే చిల్ల‌ర వాగుడుకు నిధి అలాంటోళ్లంద‌రి నోళ్లు మూయించేలా చెప్పింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్త‌తుం నిధి అగ‌ర్వాల్ మ‌హేష్ మేన‌ల్లుడు అశోక్ గల్లా హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రంలో న‌టిస్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి బ్లాక్ బాస్ట‌ర్ ఖాతాలో ఉన్నా! అమ్మ‌డు ఎందుక‌నో అవ‌కాశాలు అందుకోవ‌డంలో వెనుక‌బ‌డింది. మ‌రి ప‌వ‌న్ పై భారీ డైలాగ్..అభిమానుల దీవెన‌లు అమ్మ‌డికి ప‌వ‌న్తో ఛాన్స్ వ‌చ్చేలా చేస్తాయేమో చూడాలి.