కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నవేళ విదేశాలకు వెళ్లాలంటే సెలబ్రిటీలు, బిజినెస్‌మెన్‌లు భయపడుతుంటే యువీ టీమ్‌తో కలిసి ప్రభాస్ యూరప్ వెళ్లడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రభాస్ అభిమానుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్ `సాహో` తరువాత రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. యూరప్‌లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని వార్తలు వస్తున్నా వాటికి బెదరకుండా ప్రభాస్ మొండీగా ముందడువేయడంతో చాలా మంది ఏంటీ ప్రభాస్ మొండి ధైర్యం అని కామెంట్‌లు కూడా చేశారు.
శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో ముఖానికి మాస్కులు ధరించి యువీ టీమ్ యూరప్ ట్రిప్‌కు సిద్ధమైన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇదిలా వుంటే అంతా ఊహించినట్టుగా అక్కడ భయపడాల్సింది ఏమీ లేదని, యూరప్ వెళ్లిన యువీటీమ్ సేఫ్‌గా ఓ టెర్రిఫిక్ ఛేజింగ్ ఎపిసోడ్‌ని పూర్తి చేసిందని తెలిసింది. దీనితో పాటు అక్కడే ఓ భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేశామని, దాని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని యువీ టీమ్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రభాస్ 20వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని `బాహుబలి` తరహాలో కొత్త ప్రపంచం నేపథ్యంలో రూపొందిస్తున్నారు.