అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం `అల వైకుంఠపురములో`. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్‌ని తిరగరాసి నాన్ బాహుబలి రికార్డుల్ని సమం చేసింది.
ఈ సందర్భంగా సోమవారం టీమ్ మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ `బాహుబలి`పై అందులో నటించిన ప్రభాస్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
`బాహుబలి` గురించి నేను ఇప్పటి వరకు మాట్లాడే అవకాశం రాలేదు. రాజమౌళిగారికి వ్యక్తిగతంగా మాత్రం చెప్పాను. `బాహుబలి` సినిమాతో ప్రభాస్‌కుఎంత పేరొచ్చినా అందుకు అతను అర్హుడే. `మిర్చి` లాంటి సినిమా తరువాత ఐదు సంవత్సరాలు ఒక కమర్షియల్ హీరో కొన్ని కోట్లు సంపాదించుకుని ఉండొచ్చు. ఐదేళ్లలో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వర్కింగ్ డేస్ వుంటాయి. మిగతా మూడున్నర సంవత్సరాలు ఖాళీగానే వుంటాయి. అంత కాలం ఒక విషయాన్ని నమ్మి వేచి చూసిన దానికి అతను త్యాగం చేసిన దానికి ఎంత పేరొచ్చినా దానికి అతను అర్హుడే. మేడమ్ టూస్సాడ్స్‌లో అతని స్టాచ్యూ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఈ రోజు మా రెండు సినిమాలు టాప్ టులో వుండటం ఆనందంగా వుంది. రికార్డ్స్ అనేవి ఎప్పుడూ మారుతుంటాయి. ఇవాళ మనం కొట్టొచ్చు, ఆర్నెళ్ల తరువాత మరొకరు కొట్టొచ్చు. అయితే ప్రజల మనసుల్లో ఒక సినిమా ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూశారా అది ఫరెవర్. దాన్నెవ్వరూ రిప్లేస్ చేయలేరు` అని బన్నీ అన్నారు.