కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ నడుస్తోంది. ఈ సయంలో అంతా ఇంటి పట్టునే వుంటున్నారు. బయటికి రావడానికి సాహసించడం లేదు. ఇదే సమయంలో ఇంటి పట్టునే వుంటూ చిత్రాలు చూపిస్తున్నారు. నెలకో.. ఆరునెలలకో.. ఏడాదికో సినిమా చూపించే సినిమా వాళ్లు లాక్‌డౌన్ పుణ్యమా అని రోజుకో సినిమా చూపిస్తున్నారు.
వెరైటీ వెరైటీ వీడియోలతో సోఎషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కాళ్లు తల క్రిందులుగా పెట్టి కొంత మంది కొత్త కొత్త ఫీట్లు చేస్తుంటే కొంత మంది మాత్రం తీన్ మార్ డ్యాన్సులతో రచ్చ చేస్తున్నారు. ఆటీ పాత్రల్లో నటిస్తూ కామెడీ చేస్తున్న హాట్ ఆంటీ ప్రగతి కూడా లాక్‌డౌన్ వేళ రచ్చ చేస్తోంది. ఇటీవల విజయ్ నటిస్తున్న `మాస్టర్` చిత్రంలోని ఓ మాస్ బీట్‌కు తీన్‌మార్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేసింది.
తాజాగా యోగాసనాలకు సంబంధించిన ఫొటోలని షేర్ చేసింది. ఈ వయసులో ప్రగతి ఆంటీ ఫిట్ నెస్ చూసిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. నమ్మలేకపోతున్నాం అంటూ అవాక్కవుతున్నారు. కొన్నేళ్ల క్రితమే `గౌరమ్మా నీ మొగుడెవరమ్మా` సినిమా కోసం వితౌట్ పావడాతో స్కూటర్ రైడ్ చేస్తూ రచ్చ చేసిన ప్రగతికి ఇవన్నీ కొత్తేమీ కాదని ఆమె గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు.