ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుని అమెరికా పయనమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ లో స్థిరపడేందుకు రకరకాల ప్రణాళికలతో పీసీ బిజీగా ఉంది. అక్కడ వరుస సినిమాలకు సంతకాలు చేస్తూ వెబ్- టీవీ సిరీస్ లలో నటిస్తూ బిజీ అవుతోంది. ఆ క్రమంలోనే ప్రియాంక చోప్రా సోదరుడితో డేటింగ్ చేస్తున్న తెలుగు హీరోయిన్ పేరు ఇటీవల వైరల్ గా మారింది. ప్రస్తుతం అందరి కళ్ళు పీసీ సోదరుడు సిద్ధార్థ్ చోప్రాపై ఉన్నాయి. ఇంతకీ అతడిని ప్రేమిస్తున్న ఆ హీరోయిన్ ఎవరు? అంటూ ఆరాలు మొదలయ్యాయి.
ఈ అమ్మడి పేరు నీలం ఉపాధ్యాయ. తాజాగా సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాలో శుభాకాంక్షలు తెలుపుతూ సుదీర్ఘంగా తమ మధ్య అనుబంధాన్ని గుర్తు చేయడం హాట్ టాపిక్ గా మారింది. “పుట్టినరోజు శుభాకాంక్షలు సిద్ధార్థ్. మీతో ఈ పయనం ఎంతో సంతోషాన్నిస్తుంది. మీతో ఆ రాత్రులు మరువలేనివి. లేస్‌తో నా నోరు నింపడం… కొన్ని గజిబిజి విషయాలు.. డిన్నర్ డేట్లు.. లాంగ్ డ్రైవ్‌లకు బయలుదేరడం.. మీతో కొత్త ప్రదేశాలను అన్వేషించడం చాలా ఇష్టం…“ అంటూ సుదీర్ఘ వ్యాఖ్యానం రాసింది. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే కాదు అంతకుమించి అని చెప్పకనే చెప్పింది నీలం.
అంతకుముందు, సిద్ధార్థ్ చోప్రా తన ప్రేయసి ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందు.. అది క్యాన్సిల్ అయ్యింది. అయితే అందుకు కారణం ఎవరికీ తెలియదు. ప్రస్తుతం నీలమ్ తో సిద్ధార్థ్ లవ్ లో ఉంటే ఇక పెళ్లాడేస్తేనే బెటర్ అంటూ నెటిజనులు సూచిస్తున్నారు. నీలం ఉపాధ్యాయ్ ఇంతకుముందు మిస్టర్ 7 అనే చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అటుపై అల్లరి నరేష్ హీరోగా ఏ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనీల్ సుంకర తెరకెక్కించిన యాక్షన్ 3డి చిత్రంలోనూ నీలమ్ నటించింది. కానీ అవన్నీ ఫ్లాపులుగా నిలవడంతో కెరీర్ పరంగా ఏమంత రాణించలేకపోయింది.