ప్రభాస్ మైండ్‌ పెద్ద హార్డ్‌డిస్క్:డైరక్టర్ సుజీత్

ప్రభాస్ మైండ్‌ పెద్ద హార్డ్‌డిస్క్:డైరక్టర్ సుజీత్

ప్యాన్ ఇండియా మూవీగా భారీ హైప్‌ క్రియేట్‌చేసిన సాహో రిలీజ్‌కు సిద్దమవుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్‌కు భారీ​ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆదివారం సాయంత్రం సాహో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించారు. ఈ పంక్షన్ లో డైరక్టర్ సుజీత్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.

దర్శకుడు సుజీత్‌ మాట్లాడుతూ.. ‘‘బాహుబలి’ తర్వాత వెంటనే ప్రభాస్‌ నుంచి సినిమా రావాలని ఫ్యాన్స్‌ అనుకుంటారు. కానీ, రెండేళ్లు ఎంతో ఓపికగా వేచి చూశారు. అందుకు ధన్యవాదాలు. నా ఒత్తిడులన్నీ నా ఫ్రెండ్స్‌కు, అమ్మానాన్నలకు ఇస్తా. అందుకే సెట్‌లో నేను ఎక్కువ ప్రశాంతంగా ఉంటా. షార్ట్‌ ఫిలింస్‌ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చా. ఒక షార్ట్‌ ఫిలింకు సంబంధించిన డీవీడీని ప్రభాస్‌ అన్న చూసి, నన్ను పిలిపించారు. అప్పుడు నేను ‘మిర్చి’సినిమా చూస్తున్నా. ప్రభాస్‌ పిలుస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయా. సరదాగా అన్నారేమోనని అప్పుడు వెళ్లలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు వెళ్తే, ‘ఏంటి డార్లింగ్‌.. అప్పుడు పిలిస్తే రాలేదు’ అన్నారు.

ఆయన మైండ్‌ పెద్ద హార్డ్‌డిస్క్‌. నాలుగేళ్ల కిందట కూడా చెప్పినవి ఆయనకు గుర్తు ఉంటుంది. ట్రైలర్‌ చివరిలో ప్రభాస్‌ అన్న తలలో నుంచి రక్తం వస్తూ ఉండే సన్నివేశం ఉంటుంది. తొలుత ఈ షాట్‌ గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు కూడా ఆయన ఆ షాట్‌ను గుర్తు పెట్టుకున్నారు. రాజమౌళిగారి సినిమా తర్వాత ప్రభాస్‌ చిత్రం చేయడమంటే సముద్రానికి ఎదురు ఈదడమే. కానీ, నాపై ప్రభాస్‌కు ఎంతో నమ్మకం ఉంది. అందుకే ప్రోత్సహించారు. మదిగారు, సాబూ శిరిల్‌ సర్‌, కమల్‌ కణ్ణన్‌, జిబ్రాన్‌ ఈ సినిమాకు ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా జిబ్రాన్‌ నేపథ్య సంగీతం సినిమాకు బలం. చివరి 30 నిమిషాలు విజువల్స్‌, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ మైండ్‌ బ్లోయింగ్‌. నిర్మాతలుగా వంశీ, ప్రమోద్‌ అన్నలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. వారందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.