పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

56 మంది జీవితాల్ని రిస్క్‌లో పెట్టిన పృథ్వీరాజ్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు క్లిష్ట‌ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. స‌డ‌న్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ని విధించ‌డంతో యూనిట్ స‌భ్యులంతా జోర్డాన్లోరి ఏడారిలో చిక్కుకుపోయారు.

వీళ్ల‌ని క్షేమంగా ఇండియా తీసుకురావాల‌ని మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు ర‌ద్దు కావ‌డంతో ఎక్క‌డి వారు అక్క‌డే ఆగిపోవాల్సి వ‌చ్చింది. తాజాగా త‌మ ప‌రిస్థితిపై ఫేస్ బుక్‌లో హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. `అంద‌రికి వంద‌నం. ఈ క‌ఠిన‌మైన స‌మ‌యాల్లో ప్ర‌తి ఒక్క‌రూ సుర‌క్షితంగా వుండటానికి త‌మ వంతు కృషి చేస్తున్నార‌ని ఆశిస్తున్నాను. మార్చి 24న జోర్డాన్‌లో `ఆడు జీవితం` షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది.ప‌రిస్థితిని అంచ‌నా వేసిన త‌రువాత వాడిరామ్ ఎడారి ప‌రిమితుల్లో మా యూనిట్ సుర‌క్షితంగా షూటింగ్ చేసుకోవ‌చ్చ‌ని అధికారులు చెప్పారు. అందు వ‌ల్ల షూటింగ్ చేసుకోవ‌డానికి ముందుకు వెళ్లాం. దుర‌దృష్ణ వ‌శాత్తు వెంట‌నే జోర్డాన్ లో ఆంక్ష‌ల్ని మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు.

దాని కార‌ణంగా షూటింగ్ 27న ఆపేయాల్సి వ‌చ్చింది. ఆ రోజు నుంచి చిత్ర బృందం వాడిరామ్‌లోని ఎడారి శిబిరంలోనే త‌ల‌దాచుకోవాల్సి వ‌చ్చింది. మా ముందుకున్న ఒకే ఒక ఆప్ష‌న్ అందుబాటులో వున్న అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇండియా రావ‌డం. ఏప్రిల్ రెండ‌వ వారం వ‌ర‌కు వాడి ర‌మ్ ఎడారిలో షూటింగ్ జ‌ర‌పాల‌ని ప్లాన్ చేశాం. అంత వ‌ర‌కు మా వ‌ద్ద ఆహారాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఆ స‌మ‌యానికి ఏం జ‌రుగుతుందో అని ఆందోళ‌న‌గా వుంది. ప్ర‌తీ 72 గంట‌ల‌కు ప్ర‌తి సిబ్బందికి డాక్ట‌ర్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. మా బృందంలో ఒక డాక్ట‌ర్ వున్నాడు. జోర్డాన్‌కి చెందిన మ‌రో డాక్ట‌ర్ కూడా వున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా మా 58 మంది ఇంటికి తిరిగి రావడానికి ఆందోళ‌న చెందుతున్నాం.
మాలాగే వేలాది మంది భార‌తీయులు స్వ‌దేశానికి తిరిగి రావాల‌ని వేచి వున్నారు. త‌గిన స‌మ‌యం, అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు మేము కూడా ఇండియా తిగిరి రాగ‌ల‌మ‌ని ఆశిస్తున్నాను. అని పృథ్వీరాజ్ పెట్టిన పోస్ట్ అక్క‌డి ప‌రిస్థ‌తిని వెల్ల‌డిస్తూనే వారి జీవితాలు ఎంత ప్ర‌మాదంలో వున్నాయో స్ప‌ష్టం చేసింది.