కోలీవుడ్ లవ్ కపుల్ నయనతార – విఘ్నేష్ శివన్ మధ్య రొమాంటిక్ వెకేషన్స్ గురించి తెలిసిందే. ఆ ఇద్దరి రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు నిరంతరం నెటిజనుల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. విఘ్నేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. నిరంతరం హాలిడే జాలీట్రిప్ లకు సంబంధించిన ఫోటోలను తన లేడీలవ్ తో ఉన్నవి అభిమానులకు షేర్ చేస్తుంటాడు. అయితే ఈసారి వేలెంటైన్స్ డే కి నయన్ కి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడు? అన్నది మాత్రం రివీల్ కాలేదు.
తాజాగా వాలెంటైన్స్ డే రోజున విఘ్నేష్ తన ప్రేయసి నయనతారకు రాసిన ఓ లేఖ వివరాలు వెల్లడయ్యాయి. నయన్ తో ఐదు సంవత్సరాల పాటు సాగించిన తన అనుబంధానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి వాటికి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చాడు. “ప్రతిరోజూ మీ బేషరతు ప్రేమ మరియు ఆప్యాయతతో వాలెంటైన్స్ డే” అని రాశారు. “నా అందమైన పడుచుపిల్ల కథ – ఇప్పుడు 5 సంవత్సరాలు ఈ ఐదేళ్లలో ఎన్నోఅందమైన క్షణాలు ప్రేమతో నిండి ఉన్నాయి. నయనతార నీ ప్రేమలో నీ ఎఫెక్షన్‌లో ప్రతీరోజు వాలెంటైన్స్ డేనే` అని వర్ణించడం ఆసక్తికరంగా మారింది.