న‌మిత‌ పోర్న్ వీడియోలంటూ బ్లాక్ మెయిల్‌!

భారీ అందాల‌తో యువ‌త‌ని ఆక‌ట్టుకునే అందం బొద్దుగుమ్మ న‌మిత సొంతం. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన న‌మిత గ‌త కొంత కాలంగా క్రేజ్ త‌గ్గ‌డంతో హార‌ర్ చిత్రాలు, బీ గ్రేడ్ చిత్రాల్లో న‌టిస్తోంది. అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా హాట్ ఐట‌మ్ సాంగ్‌ల్లో మెరుస్తోంది. ఇటీవ‌ల వివాహం చేసుకున్నా వ‌రుస హాట్ ఫొటో షూట్‌ల‌తో యువ‌త‌ని రెచ్చ‌గొడుతోంది.

తాజాగా న‌మిత‌ని ఓ నెటిజ‌న్ ఫోన్ చేసి బెదిరించ‌డం మొద‌లుపెట్టాడ‌ట‌. త‌ను కోరింది ఇస్తావా? లేక పోర్న్ వీడియోల‌ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయాలా అంటూ బెదిరించ‌డం మొద‌లుపెట్టాడ‌ట‌. హాటీ అంటూ ఫోన్‌లో త‌న‌ని పిలుస్తున్నాడ‌ని న‌మిత తాజాగా ఆ బ్లాక్ మెయిల‌ర్ బండారాన్ని బ‌య‌ట పెట్టింది. అయామ్ త‌మిళ సెంత‌మిళ్ అనే ఓ యువ‌కుడు త‌న‌ని వేధిస్తున్నాడ‌ని. ఈ ఇలాంటి చీప్ మైండ్ వున్న వాళ్ల‌తో స్టార్స్‌, సెల‌బ్రిటీలు జాగ్ర‌త్త‌గా వుండాల‌ని ఫొటో, అకౌంట్‌తో స‌హా ఇన్‌స్టాలో పోస్ట్ చేసయ‌డంతో ఓ బ్లాక్ మెయిల‌ర్ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. కోలీవుడ్‌లో న‌మిత వ్య‌వ‌హాసం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.