నైట్ గడపమని అడగటానికి ఆ డైరక్టర్ వాడే కోడ్ ఇదే

హీరోయిన్ ఛాన్స్ కావాలంటే నైట్ గడపమన్న డైరక్టర్

ఇద్దరు డైరక్టర్లు ఒక్క రోజు రాత్రి తమతో గడపాలని అడిగాడని మోడల్‌, బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్‌ పేర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్, మీటూ వివాదంలో ఇప్పటికే అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వీడన్‌కు చెందిన ఎల్లీ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి తాజాగా ప్రస్తావించారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో తనకు ఎదురైన చేదు సంఘటనలను పంచుకున్నారు. సినిమాలో అవకాశం కోసం వస్తే ఇద్దరు ద‍ర్శకులు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని బాలీవుడ్‌ నటి ఎల్లి అవ్రామ్‌ అన్నారు.

మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. బాలీవుడ్‌లో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. స్వీడన్‌కు చెందిన తనకు అక్కడ అవకాశాలు లభించకపోవడంతో అవకాశాలు వెతుక్కుంటూ.. బాలీవుడ్‌కు వచ్చినట్లు తెలిపారు.

ఆఫర్ల కోసం కొన్ని మీటింగ్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరు దర్శకులు నాకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి… వారి వేలితో గోకారు. తొలి మీటింగ్‌ తర్వాత దీని గురించి నా స్నేహితుడ్ని అడిగా. అతడు షాక్‌ అయ్యాడు. ‘వాళ్లు నీతో అలా ప్రవర్తించారా? దాని అర్థం నీకు తెలుసా?’ అన్నాడు. నాకు తెలియదని చెప్పా. వాళ్లు తమతో నిన్ను ఓ రాత్రి గడపమని అంటున్నారని చెప్పాడు. సిని పరిశ్రమలో రాణించడం చాలా కష్టం. ఓ పెద్ద ప్రాజెక్టుకు నన్ను తీసుకోవాలి అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఇలాంటి సమస్య వచ్చింది. దీంతో నటుడికి నాతో సమస్య ఏర్పడి, మరో నటిని తీసుకున్నారు. నన్ను తొలగించారు. నిర్మాత కాల్‌ చేసి నాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా బాధపడ్డా’ అని ఆమె అన్నారు.

ఇక కథ నిమిత్తం ఓ దర్శకుడికి దగ్గరకు వెళ్లితే తాను చాలా పొట్టిగా ఉన్నానని, ముందు పళ్లు బాగోలేవని తొలుత హేళన చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే మరో దర్శకుడు కూడా తనతో ఇలానే ప్రవర్తించినట్లు గుర్తుచేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో అవకాశాలు రావడం చాలా కష్టమన్నది. షూటింగ్‌ సమయంలో ఇలాంటి వేధింపులు తాను చాలా ఎదుర్కొన్నట్లు చెప్పింది.