బాలీవుడ్లో వారసుల ఎంట్రీ ఎప్పుడూ జోరుగానే జరుగుతుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ ని ఏల్తోంది కూడా బ్యాంక్ గ్రౌండ్ ఉన్న హీరోల తనయలే. తాజాగా మరో వారసుడు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. బిగ్ బీ అమితాబచ్చన్ మనవడు, అభిషేక్ బచ్చన మేనల్లుడు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ నందా కుమారుడు అగస్త్య నందా హీరోగా పరిచయం కాబోతున్నాడు. చిన్న తనం నుంచి సినిమాల్లోకి రావాలని అగస్త్య కోరికట. అందుకే కుమారుడి కోరిక మేరకు తల్లిదండ్రులు, తాతయ్య బిగ్ బి గ్రాండ్ గా లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
సోషల్ మీడియాలో కూడా అగస్య్త యాక్టివ్ గా ఉంటాడు. అంతన్ని ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. దీంతో అగస్త్య అప్పుడే అవకాశాలు క్యూ కడుతున్నాయి. మంచి స్ర్కిప్ట్ కుదిరితే లాంచ్ అవ్వడమే ఆలస్యమంటున్నారు. తాతయ్య అభిషేక్ తో కలిసి అగస్త్య వర్కౌట్లు చేస్తున్న కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారియి. అగస్త్య సోదరి నవ్య నవేలి నందా మోడల్ గా రాణిస్తోంది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగంలోనూ నవ్య సేవలందిస్తోంది. అమితాబ్ ఫ్యామిలీలో అంతా యాక్టర్లే. జయాబచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇలా ఒకే ఫ్యామిలీలో ఉన్నారు. తాజాగా మనవడి ఎంట్రీతో ఆ నెంబర్ పెరగబోతుంది.
ఇటీవలే నెపోటిజం కారణంగా యంగ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపణలొస్తున్నాయి. బంధుప్రీతితో కొంత మంది పెద్దలు సినీ నేపథ్యం లేని నటులను ఎదగనీవడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఆ కామెంట్లకు మద్దతు తెలిపారు. దీంతో నెపోటిజం బాలీవుడ్ లో అంత పీక్స్ లో నడుస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతలోనే బిగ్ బీ మనవడి ఎంట్రీ వార్త పై ఆసక్తిని సంతరించుకుంది.