“ప్రాజెక్ట్ కే” పై వైరల్ గా మారిన మరో ఎలిమెంట్స్.!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వరల్డ్ లెవెల్ సినిమా దగ్గర ఐతే ఒక ప్రైడ్ ఇండియన్ సినిమాగా రాబోతున్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం “ప్రాజెక్ట్ కే” అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రంలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

ఇక మాసివ్ ప్రాజెక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సహా అత్యంత భారీ తారాగణంతో తెరకెక్కిస్తుండగా ఈ రెండు రోజులు నుంచి మరికొన్ని కొత్త అంశాలు అయితే ఇపుడు వైరల్ గా మారాయి. కాగా వీటిలో రెండు చాలా హైలైట్ గా అనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ వర్సెస్ ఉలగనయగన్ కమల్ హాసన్ భారీ యుద్ధం ఉంటుంది అని తెలిసిందే.

కానీ మరో బిగ్గెస్ట్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ తో కూడా ప్రభాస్ కి కలిపి ఓ భారీ ఏక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో అమితాబ్ గురు కాగా ప్రభాస్ తనకి శిష్యుడుగా కనిపిస్తాడు అని అలా ఇద్దరి మధ్య ఓ ఏక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అని తెలుస్తుంది.

ఇక మరో అంశం ఏమిటంటే ఈ చిత్రం టైటిల్ కోసం తెలుస్తుంది. ఇప్పటికి చాలానే టైటిల్ లు వినిపించినప్పటికీ ఇప్పుడు అయితే అసలు “ప్రాజెక్ట్ కే” అంటే అంటి అందులో కే కి అర్ధం ఏంటి అనేది రివీల్ అవుతుంది. ఇందులో కే అంటే “కాలచక్రం” అట. “ప్రాజెక్ట్ కాలచక్రం” గా ఈ చిత్రంపై టైటిల్ పరిశీలనలో ఉందని లేటెస్ట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి మరి ఈ రెండు ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.