‘ప్రాజెక్ట్ కే’ దీపికా లుక్ రిలీజ్..ఫైరవుతున్న ఫ్యాన్స్.!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రాల్లో ఇప్పుడు ప్రపంచ ఆడియెన్స్ అటెన్షన్ ని పట్టుకోవడానికి వస్తున్నా భారీ చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. మరి యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు నుంచే ప్రమోషన్స్ కూడా సెట్ చేసుకుంటూ ఉండగా..

హాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ అయినటువంటి కామిక్ కాన్ లో పాల్గొనబోతున్న మొదటి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇక ఇదే గ్యాప్ లో చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఫ్యాన్స్ ని అలెర్ట్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్డేట్స్ అందిస్తుంది. అయితే అలా నిన్న ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ పోస్టర్ ని సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేస్తామని చెప్పారు.

దీనితో ఫ్యాన్స్ అంతా బాగా ఎగ్జైట్ అవ్వగా దానిని కాస్త లేట్ చేసి ఎప్పుడో రాత్రి పదిన్నర టైం కి రిలీజ్ చేశారు. అయితే అది చూసాక ఫ్యాన్స్ ఆగ్రహం అంతా ఇంతా కాదు ఏదేదో కాస్ట్యూమ్స్ లో అదరగొట్టేస్తారు అనుకుంటే జస్ట్ ముఖం ఒక్కటే చూపించి నిరాశపరిచారు. దీనితో ఈ డబ్బా పోస్టర్ కోసం ఇంతసేపు వెయిట్ చేయించారు అని ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

అసలు ఫస్ట్ లుక్ పోస్టర్ అంటారా దీనిని అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ప్రాజెక్ట్ నుంచి ఇదొక డిజప్పాయింటింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో అమితాబ్, కమల్ లాంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. మరి వారికేం చేస్తారో చూడాలి.