నిలువు బొట్టు… కోర మీసం.. ప‌వ‌న్ గెట‌ప్‌!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ షెడ్యూల్ ఇంత టైట్‌గా వున్నా ఓ ప‌క్క రాజ‌కీయచ‌మీటింగ్‌ల‌కు, మ‌రో ప‌క్క సినిమాల‌కు ఎలా కేటాయిస్తున్నాడో స్టార్ హీరోల‌తో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కుడికి అంతుచిక్క‌డం లేద‌ట‌. ఒక‌సారి చూస్తే `వ‌కీల్‌సాబ్‌` సెట్‌లో బిజీగా వుంటున్న ప‌వ‌న్ మ‌రోసారి చూస్తే క్రిష్ మూవీ సెట్‌లో పిరియాడిక్ గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు. ఈ రెండింటికీ మ‌ధ్య బ్రేక్ ల‌భించిందా రాకీయ వేదిక‌ల‌పై క‌నిపిస్తూ షాకిస్తున్నారు.

ఇదిలా వుంటే క్రిష్ తెర‌కెక్కిస్తున్నపిరియాడిక్‌ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ‌ల సాయ‌న్న‌గా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. మొఘ‌ల్ కాలం నాటి క‌థ‌తో కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఇండియ‌న్ తెర‌పై ఇంత వ‌ర‌కు ట‌చ్ చేయ‌ని స‌రికొత్త క‌థ‌తో క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ప‌వ‌న్ గెట‌స్‌కు సంబంధించి క‌నిపించి క‌నిపించ‌కుండా వున్న ఓ పిక్ బ‌య‌టికి వ‌చ్చింది.

ఈ మ‌ధ్య పెద్ద సినిమాల ఆన్ లొకేష‌న్ పిక్స్ వ‌రుస‌గా లీక్ అవుతూ యూనిట్ వ‌ర్గాల‌ని ఆందోళ‌న‌కు గురిచేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ప‌వ‌న్ లుక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. పండుగ‌ల సాయ‌న్న వేష‌ధార‌ణ నిలువు బొట్టు, కోర మీసం.. క‌ళ్ల‌ల్లో తెగింపుతో ఫెరోషియ‌స్‌గా వుంటుంది. అదే లుక్‌లో ప‌వ‌న్ క‌నిపిస్తున్న ఓ పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నిలువు బొట్టు, కోరమీసంతో ప‌వ‌న్ లుక్ అదిరిపోయింది. ఈ గెట‌ప్‌లో వున్న ప‌వ‌న్‌పై క్రిష్ ఓ ప‌డ‌వ ఫైట్‌ని ప్లాన్ చేశాడ‌ట‌.