నితిన్ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి గెస్ట్‌లిస్ట్ ఫైన‌ల్‌!

టాలీవుడ్‌లో యంగ్ హీరో నితిన్‌ని అభిన‌వ గ‌జిని అనొచ్చు. ఎందుకంటే 11 వ‌రుస ఫ్లాప్‌లు ఎదురైనా ప‌ట్టువ‌ద‌ల‌కుండా గ‌జినీలా దండ యాత్ర చేసి చివ‌రికి `ఇష్క్‌` సినిమాతో స‌క్సెస్‌ల బాట‌ప‌ట్టాడు. అక్క‌డి నుంచి మ‌ళ్లీ ప‌డుతూ లేస్తూ విజ‌యాల‌తో ముందుకు సాగిపోతున్నాడు. గ‌త కొంత కాలంగా నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని, అది కూడా ల‌వ్ అండ్ అరేంజ్డ్ మ్యారేట్ అనే వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. హైదాబాద్‌కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ షాలినితో గ‌త కొంత నాలుగేళ్లుగా నితిన్ ప్రేమ‌లో వున్నారు. వీరి ప్రేమ‌కి ఇరు కుటుంబాల వాళ్లు అంగీకారం తెలప‌డంతో ఏప్రిల్ 15న దుబాయ్‌లో గ్రాండ్‌గా డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి నితిన్ ఫ్యామిలీ ఏర్పాట్లు చేసుకుంటోంద‌ని, ఇప్ప‌టికే దుబాయ్‌కి ఆహ్వానించే గెస్ట్‌ల‌ని లిస్ట్ ఔట్ చేసేసింద‌ని, వారికి ఫ‌స్ట్ క్లాస్ టిక్కెట్‌ల‌ని కూడా బుక్ చేసే ప‌నిలో బిజీ అయిపోయింద‌ని తాజాగా ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

నితిన్ వివాహానికి 50 నుంచి 60 మంది గెస్ట్‌లు వ‌చ్చే అవ‌కాశం వుంద‌ట‌. వీరికి ఇప్ప‌టికే ఆహ్వానాలు అందాయ‌ని, దాంతో పాటు ప్ర‌యాణ టిక్కెట్‌ల‌ని కూడా ఇవ్వ‌బోతున్నార‌ని తాజా న్యూస్‌. ఏప్రిల్ 16న హైద‌రాబాద్‌లో భారీగా రిసెప్ష‌న్‌ని ప్లాన్ చేశార‌ట‌.