నాడు బాహుబ‌లి నేడు రాధే శ్యామ్.. ఇదేం వాడ‌కం?

Radhe Shyam

                                      అస్సాం పోలీసా మ‌జాకానా?

ముసుగును ధరించడం, శానిటైజర్ లేదా హ్యాండ్ వాష్ ఉపయోగించడం ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి. ప్రభుత్వాల‌కు అండ‌గా నిలిచే ఎన్జీఓలు.. సెలబ్రిటీల వరకు, ప్రతి ఒక్కరూ సామాన్యులకు మాస్క్ ను ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ పరిస్థితులలో, అస్సాం పోలీసుల క్రియేవిటీ హాట్ టాపిక్ గా మారింది. ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ ఇలా రిలీజ్ కాగానే అలా ఆ ఫోటోని ఫోటోషాప్ లో మార్ఫింగ్ చేసి మాస్క్ ప్ర‌చారానికి వాడేశారు. ఫోటో షాప్ చేసిన‌ చిత్రంలో నాయ‌కానాయిక‌ల జంట మాస్క్ ధ‌రించి ఫ‌క్కున న‌వ్వుకునేలా క‌నిపించ‌డం విశేషం. పోలీసుల ఈ ఛ‌మ‌త్కారం నిజంగానే న‌వ్వు పుట్టించ‌క మాన‌దు. ఇంత‌కుముందు బాహుబ‌లి పోస్ట‌ర్ ని ఇదే తీరుగా పోలీసులు ఉప‌యోగించారు. పోస్ట‌ర్ లో బాహు- భ‌ల్లా మాస్కులు ధ‌రించి ప్ర‌చారానికి బాగానే స‌హ‌క‌రించారు. అదే తీరుగా ఇప్పుడు మ‌రోసారి అస్సాం పోలీస్ క్రియేటివిటీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది.

బ‌య‌ట తిరిగితే మీవాళ్ల‌ను మాస్క్ ధ‌రించ‌మ‌ని చెప్పండి. మేం ప్రభాస్ కు పిలుపందించే ప్ర‌య‌త్నం చేసినా విన‌లేదు. అందుకే ఇలా ఫోటోషాప్ ద్వారా సందేశాన్ని పంపాం.. అంటూ పోలీసులు క్యాంపెయిన్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్ర‌భాస్ ని అవ‌మానించే ఉద్ధేశం కానీ అప‌హాస్యం చేసే ఉద్ధేశం కానీ త‌మ‌కు లేనేలేద‌ని కూడా పోలీసులు వివ‌ర‌ణ ఇచ్చారు.