టాలీవుడ్‌లో వున్న మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. తొలి చిత్రం `డాలర్ డ్రీమ్స్` నుంచి `ఫిదా`.. నాగచైతన్యతో చేస్తున్న `లవ్‌స్టోరీ` వరకు ఆయన పంథా ఆయనదే. మరొకరిని అనుకరించడం.. తన పంథాకు భిన్నంగా వెళ్లడం శేఖర్ కమ్ములకు తెలియని విద్య. సెన్సిబులిటీస్‌ని ప్రధానంగా తీసుకుని అవే తన కథలకు ప్రధాన బలంగా వాడుకుంటూ సినిమాలు చేస్తుంటారాయన.
అలాంటి సెన్సిబుల్ డైరెక్టర్‌పై ట్రాన్స్ జెండర్స్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. కరోనా వైరస్ కారణంగా అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాల కోసం తీరక ఆకలితో అలమటిస్తున్నారు. సినీ హీరోలు, నిర్మాతలు సినీ వర్గాలకు విరాళాలు ప్రకటించి ఆదుకుంటున్నారు. అయితే మిగతా వర్గాలు మాత్రం ఇప్పటికీ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా ట్రాన్స్ జెండర్స్ పరిస్థితి చాలా దారుణంగా వుంది. అయితే వారిని దర్శకుడు శేఖర్ కమ్ముల ఆదుకున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎక్కడా పబ్లిసిటీ చేసుకోలేదు. సానిటైజర్లు పంచుతూ ఫొటోలకి పోజులిస్తున్నా తను సాయం చేసిన విషయాన్ని ఎక్కడా వెలియనివ్వలేదు శేఖర్ కమ్ముల అయితే ఆయన నుంచి సాయాన్ని పొందిన హిజ్రాలు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.
Once again @sekharkammula sir you proved how happy it is to serve the needy and poor.Thank you for standing with Transgender community of Hyderabad in these dry days of lock down in their hard survival with no work and no money. Expecting more such humanity from Tollywood..! pic.twitter.com/kRKVbJLil8
— Rachanamudraboyina (@Rachanamudra) April 23, 2020