దేవరకొండ‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ మీకు మాత్రమే చెప్తా’విడుదల తేదీ ఖరారు

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాణంలోకి కూడా దిగుతున్నాడు . పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడిని వెండితెరపై హీరోగా పరిచయం చేసేందుకు విజయ్‌ దేవరకొండ సిద్దమయ్యాడు. తన సొంత బ్యానర్‌ ‘కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్’ పై యంగ్ టాలెంట్ ప్రోత్సాహం అందించేందుకు తొలి అడుగు వేస్తున్నాడు.

విజయ్ తన సొంత బ్యానర్‌లో ‘ మీకు మాత్రమే చెప్తా’ సినిమా ప్లాన్ చేశాడు. . ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించి ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తే మంచి క్రేజ్ వచ్చింది. ఈ నేపధ్యంలో చిత్రం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 18న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

తరుణ్‌ భాస్కర్‌, అనసూయ, అభినవ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం.. ఫస్ట్‌ లుక్‌, టీజర్ తోనే ఆకట్టుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతీ ఫోన్‌లో సీక్రెట్స్‌ ఉంటాయి అంటూ ఈ సినిమా కథ సాగనుంది. షమీర్‌ సుల్తాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.