థియేటర్లు రీ ఓపెన్ ఇప్పట్లో సాధ్యం కాదా? జూన్..జూలై నెలలకైనా థియేటర్లు తెరుచుకోవా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి.సాక్షాత్తు ఈ విషయాన్ని అగ్ర నిర్మాత డి. సురేష్ బాబే అంటున్నారు. కరోనా వైరస్ విజృంభణ నానాటికి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈనెల 14 తో ముగుస్తుంది అనుకున్న లాక్ డౌన్ మే 3 వరకూ ప్రధాని పొడింగించారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఒకేసారి అన్ని తెరుస్తారు? అన్న గ్యారెంటీ అయితే లేదు. దశల వారిగా ఒక్కొక్కటీ ఓపెన్ చేసే అవకాశం ఉంది. తాళం వేసినవన్నీ ఒకేసారి తెరిస్తే చాలా సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. పైగా జూన్…జూలై అంటే వేసవి అయిపోతుంది. వర్షాకాలంలోకి అడుగు పెడతాం. వైరస్ కి ఆ సీజన్ మరింత అనుకూలమైనది.
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మరణాల సంఖ్య పెరగడానికి ఆ చల్లదనమే కారణమైంది. భారత్ ప్రస్తుత వాతావరణం వైరస్ కి అనుకూలంగా లేకపోవడం ఇక్కడ కాస్త కలిసొచ్చే అంశమైంది. పైగా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేసరికి డిసెంబర్ దాటి పోతుందని అంటున్నారు. ఇప్పుడీ విషయాలన్నింటి విశ్లేషిస్తే థియేటర్లు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాలన్ని పరిగళలోకి తీసుకునే థియేటర్లు ఓపెన్ చేయడం ఇప్పట్లో మంచిది కాదని సురేష్ బాబు సైతం అభిప్రయాపడినట్లు కథనాలు వేడెక్కిస్తున్నాయి. థియేటర్లో సిట్టింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండటం..పైగా ఏసీ థియేటర్లు..ఏక ధాటిగా రెండున్నర గంటలు ఒకే చోట కూర్చోవడం…సీట్ కీ సీట్ కి మధ్య గ్యాప్ తక్కువగా ఉండటం..ఎంట్రీ గేట్..ఎగ్జిట్ గేట్ వద్ద ఒకేసారి జనం గుమ్ముకూడటం వంటి అశాలు వైరస్ కి అనుకూలమైనదిగా భావిస్తున్నారుట.
థియేటర్లతో పొలిస్తే ఇతర పరిశ్రమలు..షాపింగ్ మాల్స్ వేరని..వాటిలో అంత ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రయాలు సైతం విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆ విధంగా గనుక విశ్లేషంచ గల్గితే మాత్రం థియేటర్లు రీ ఓపెన్ చేయడం అన్నది ఇప్పట్లో సాధ్యం కాని పని అనే అంటున్నారు. పైగా మెట్రోపాలిటిన్ సిటీస్ లో ఉన్న మల్టీప్లెక్స్ లు అన్ని షాపింగ్ మాల్స్ తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి అది మరింత ప్ర్రమాదకరమని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.