సాధారణంగా మనం షాపింగ్ మాల్స్ వెళ్లిన లేదా థియేటర్లకు వెళ్లిన అక్కడ టాయిలెట్స్ డోర్స్ కనుక గమనిస్తే కింద పూర్తిగా కప్పి వేయకుండా కాస్త గ్యాప్ ఇచ్చి ఉంటారు అయితే మీరు ఎప్పుడైనా ఇలా టాయిలెట్ డోర్స్ ఎందుకు గ్యాప్ ఇచ్చి ఉన్నాయో ఆలోచించారా.సాధారణంగా టాయిలెట్స్ డోర్స్ పూర్తిగా కప్పి వేసి ఉంటాయి. కానీ థియేటర్లో షాపింగ్ మాల్స్ లో మాత్రం ఇలా గ్యాప్ ఇచ్చి ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..
సాధారణంగా థియేటర్లు షాపింగ్ మాల్స్ లో వెస్ట్రన్ టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయి.అందుకే ఈ డోర్లు కింద బాగాన కాస్త గ్యాప్ ఇచ్చి ఉంటాయి ఇలా గ్యాప్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే పొరపాటున టాయిలెట్ రూమ్ లో ఎవరైనా స్పృహ తప్పి పడిపోయిన లేదంటే ఏదైనా అఘాయిత్యాలు జరుగుతున్న బయట వ్యక్తులకు కనిపించే విధంగా డోర్స్ కాస్త కింద గ్యాప్ ఇచ్చి ఏర్పాటు చేసి ఉంటారు.
కొన్నిసార్లు థియేటర్లలోను షాపింగ్ మాల్స్ లోను అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగడం లేదంటే ఇతర కారణాలవల్ల బాత్రూంలోనే అనారోగ్యానికి గురై అక్కడే స్పృహ తప్పి పడిపోవడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బయట వ్యక్తులకు తెలియడం కోసమే ఇలా గ్యాప్ ఇచ్చి టాయిలెట్ డోర్స్ ఏర్పాటు చేసి ఉంటారు.