గత ఏడాదిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా “వకీల్ సాబ్” చిత్రంతో ఒక్కసారిగా ఏపీలో థియేటర్స్ పరంగా టికెట్ ధరల పరంగా సంభవించిన పెను మార్పులు ఏంటో అందరికీ తెలుసు. కొత్త రకం జివో లతో పాత కాలం నాటి టికెట్ ధరలు తీసుకురావడం..
పేదవాడికి అందుబాటులో సినిమా అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం ఈ ధరలు ఈ రోజుల్లో ఉన్న ఖర్చులకి బడ్జెట్ కి ఏం సరిపోతాయి అని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పుకున్న కామెంట్స్ అన్నీ అందరికీ గుర్తే. అలాగే ఈ ధరలతో అనేక చోట్ల స్వచ్చందంగా థియేటర్స్ మూసేసుకున్న సంఘటనలు కూడా చూసాము.
కానీ మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నంతో ఫైనల్ గా ముందు ధరల్లా కాకపోయినా కాస్త అధిక ధరలు అలాగే 5 షోలు తెచ్చుకున్నారు. అయితే అప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా పలు నిబంధనలుతోనే ఇవి ఇచ్చింది. రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఒక పోర్టల్ తెరుస్తుంది దాని ద్వారానే టికెట్లను అమ్మాలని సూచించారు.
దీనితో దీనిపై కూడా పెద్ద ఎత్తున నెగిటివిటి వచ్చింది. కానీ ఫైనల్ గా మాత్రం దీనిపై బ్రేకింగ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు. అన్ని థియేటర్స్ వారికి స్ట్రిక్ట్ గా చెబుతూ ఏపీఎఫ్డిసి పేరిట ఒక గైడ్ లెన్స్ తెరుస్తున్నామని దీనికి థియేటర్స్ వారు అంతా సహకరించి తీరాలని తెలిపారు.
అలాగే దీనికి అందరు అగ్రిమెంట్ చేసుకొని తీరాలి, ప్రతి టికెట్ పై 2 శాతం ఛార్జీ ఉంటుంది అట. ఇంకా అన్ని థియేటర్లు,ప్రయివేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేయాలి ఇది అంతా నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించినట్టు తెలుస్తుంది.
అలాగే ఏ సినిమాకి అయినా కూడా ఇందులో వారం రోజులు ముందే థియేటర్స్ వారు టికెట్స్ బుకింగ్ కోసం పెట్టాలని ఒకవేళ ఈ నిబంధనలు ఏ థియేటర్స్ వారు తీసుకోకపోయినా వారి లైసెన్స్ రద్దు చేస్తామని తమ కొత్త నిర్ణయాన్ని ఉత్తరువులు జారీ చేసారు.