తెలుగు హీరోయిన్ అవుతున్న మరో మలయాళీ భామ

మలయాళీ అమ్మాయిలకు టాలీవుడ్ స్వాగతం చెబుతోంది. తెలుగులో తెలుగు అమ్మాయిలు హీరోయిన్ల గా కంటే పక్క రాష్ట్రం వాళ్ళే ఇక్కడ హీరోయిన్లు గా స్థిర పడటం ఎప్పటినుండో చూస్తున్నాం. ఒకప్పటి ఆసిన్, నయనతార, ప్రియమణి దగ్గర నుంచి ఇప్పటి నివేత థామస్, నివేత పెతురాజ్, మాళవిక నాయర్ వరకు ఎంతో మంది మల్లు హీరోయిన్లు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అక్కడి నుండి వచ్చి ఇక్కడ హీరోయిన్ అవుతున్న మరో భామ పేరు అనఘ.

ఈమె RX 100 హీరో కార్తికేయ సరసన ‘గుణ 369 ‘ లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన ఈ ట్రైలర్ లో ఉన్న ప్రేమ జంట చూడముచ్చటగా ఉందని వినికిడి.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా హీరో కార్తికేయ కూడా ‘హిప్పీ’ చేసిన నష్టాన్ని ఈ సినిమాతో పూడ్చుకుంటాడేమో చూడాలి.