Home Tollywood గ్లామర్‌కు ఓకే అంటున్న మలయాళ భామ

గ్లామర్‌కు ఓకే అంటున్న మలయాళ భామ

గ్లామర్‌కు ఓకే అంటున్న మలయాళ భామ అనఘ

గ్లామర్‌కు ఓకే అంటోంది అందాల భామ అనఘ. ఆర్.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకుడు.ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. హీరోయిన్ అనఘకు నటిగా మంచి మార్కులే లభిస్తున్నాయి.

ఈ సందర్బంగా కలిసిన అనఘను గ్లామర్‌ పాత్రలపై మీ అభిప్రాయం? అని ప్రశ్నిస్తే.. కథ డిమాండ్ మేరకు గ్లామర్‌కు ఓకే. ఏదైనా శృతిమించకుండా ఉంటేనే బాగుంటుంది. నేను మలయాళీ అమ్మాయిని. ఎంటెక్ చేశాను. తల్లిదండ్రులు టీచర్లు. మాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. కానీ నాకు చిన్నప్పటినుండి సినిమాల్లో నటించాలన్న ఆసక్తిఉండేది. చదువు పూర్తయ్యాక ఎంటెక్ కోసం కొచ్చిలో ట్రైనింగ్ టైంలో పలువురు సినిమావాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా మలయాళంలో ఓ సినిమాలో సెకండ్ లీడ్‌గా ఎంపికచేసారు. ఆ సినిమా హిట్ అవడంతో హీరోయిన్‌గా అక్కడే మరో రెండు సినిమాలు చేశాను. ఆ తరువాత తమిళంలో హిప్‌హాప్ తమిజా హీరోగా సినిమా చేశా.

అది సూపర్‌హిట్ అవ్వడంతో ఈ సినిమా దర్శకుడు అర్జున్ నా ఫొటోలు చూసి నన్ను కలిసారు. పాత్ర అచ్చంగా మన పక్కింటి అమ్మాయిగా కనిపించాలని దర్శకుడు నన్ను ఎంపిక చేసారు.కథ నాకు బాగానచ్చింది. మంచిపాత్ర. దానికి తగ్గట్టుగానే మంచి ఎమోషన్ పలికించే అవకాశముంది. తెలుగు పరిశ్రమ అంటే సౌత్‌లో పెద్ద పరిశ్రమ. ఇక్కడ అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తా. తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపుతెచ్చుకోవాలని ఉంది. తెలుగులో మలయాళీ అమ్మాయిల హవా ఎక్కువగా ఉంది. నిజంగా ఆ విషయంలో హ్యాపీగాఉన్నా. నాకు మా వాల్లే కాంపిటీషన్ అని అనుకోను అని చెప్పుకొచ్చింది అనఘ.

- Advertisement -

Related Posts

ఈ సారి హిట్ పక్కా.. నాగ శౌర్య ‘లక్ష్య’ టీజర్ వైరల్

యంగ్ హీరో నాగ శౌర్య ఓ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందుకోసం రకరకాల పాత్రలను, కథలను ఓకే చేస్తున్నాడు. వరుసగా సినిమాలను లైన్‌లోపెట్టేశాడు. ప్రస్తుతం నాగశౌర్య స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. లక్ష్య...

ఫుల్లుగా తగ్గించేందుకు రెడీ.. శ్రీముఖితో కలిసి విష్ణుప్రియ వర్కౌట్లు

శ్రీముఖి, విష్ణు ప్రియల స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై యాంకర్లుగా ఉన్న వీరు చివరకు ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. యాంకరింగ్‌లో శ్రీముఖి కాస్త సీనియరే అయినా కూడా విష్ణు ప్రియ...

”తొంగి తొంగి చూడమాకు చందమామ” నేడే విడుదల!!!

  గురు రాఘవేంద్ర సమర్పణలో హరి వల్లభ ఆర్ట్స్ పతాకంపై దర్శకుడు ఆనంద్ కానుమోలు రూపొందించిన సినిమా ''తొంగి తొంగి చూడమాకు చందమామ''. ఈ చిత్రానికి ఎ. మోహన్ రెడ్డి నిర్మాత. దిలీప్, శ్రావణి...

హ్యాపీ బర్త్ డే బాస్ లేడీ.. నమ్రతపై మహేష్ బాబు ప్రేమ

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో ఉండేది మాత్రం మహేష్ బాబు నమ్రజ జంటే. ప్రేమ వివాహాం చేసుకున్న ఈ జంట టాలీవుడ్ మొత్తాన్ని ఆకర్షించింది. వంశీ సినిమాతో...

Latest News