తెలుగులో సాయి పల్లవి ‘అథిరన్’ విడుదల

సాయి పల్లవి కి తెలుగు నాట ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆమె ‘ఫిదా’ సినిమాలో మాట్లాడిన యాసకి అంతా ఆమె తెలుగు అమ్మాయే అన్నట్టు ఆదరించారు. ఆ పైన మళ్ళీ వేరే భాషల్లో సినిమాలు చేసి ఇప్పుడిప్పుడే మన తెలుగు వైపు చూస్తోంది ఈ మలయాళీ పిల్ల. సరే, ఇప్పుడు ఆమె మలయాళంలో నటించిన ‘అథిరన్’ సినిమా భారీ విజయం సాధించింది.

సాయి పల్లవి కి ఇక్కడ ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాని తెలుగులో అదే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. సాయి పల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధానపాత్రల్లో నటించిన ‘అథిరన్‌’ కు వివేక్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత
ఎ.కె. కుమార్‌, జి. రవికుమార్‌ తెలుగులో అనువదిస్తున్నారు.