స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె.. అందాల కథానాయిక సారా అలీ ఖాన్ డ్రైవర్ కి కోవిడ్ -19 పాజిటివ్ అని తెలుస్తోంది. అయితే, నటి, ఆమె కుటుంబం మరియు ఇతర సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా సురక్షితం అని తెలిసింది. సోమవారం రాత్రి, సారా స్వయంగా ఈ విషయాన్ని ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) డ్రైవర్ ని ఆస్పత్రికి తరలించారని వెల్లడించింది.
“మా డ్రైవర్ కి కొవిడ్ 19 పాజిటివ్ అని తెలిసిది. బీఎంసీ వెంటనే అప్రమత్తమైంది. అతన్ని నిర్బంధ కేంద్రానికి తరలించారు“ అంటూ సారా తెలిపింది. నా కుటుంబం, ఇంట్లో ఇతర సిబ్బంది నేను అందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా ప్రతికూల ఫలితం వచ్చింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని వెల్లడించింది.
సారా నటించిన `కూలీ నంబర్ 1` రిలీజ్ కావాల్సి ఉంది. దీంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మహమ్మారీ వల్ల ప్రతిదీ షూటింగులు వాయిదా పడిన సంగతి తెలిసిందే.