డిస్కోరాజా దెబ్బ‌తో ఈ విష‌యంలో నిర్మాత‌లు మేల్కొన్నారే?

క‌రోనా దెబ్బ‌కు దిగివ‌స్తున్నాయి?

పండ‌గ‌ల‌న్నిటిలో అతి పెద్ద పండ‌గ సంక్రాంతి. సంక్రాంతికి విడుద‌లైన నాలుగు చిత్రాల్లో బ‌న్నీ అల‌వైకుంఠ‌పురంలో చిత్రం మంచి ఊపందుకుంది. ఇక సంక్రాంతి హంగామా దాదాపు అయిపోయిన‌ట్లే. మ‌రో రెండు రోజుల్లో జ‌న‌వ‌రి కూడా అయిపోయింది. సరిలేరు కలెక్షన్స్ బావున్నాయి. దర్బార్ ఫర్వాలేదనిపించింది. ఇక నంద‌మూరి హీరో కళ్యాణ్ రామ్ `ఎంత మంచివాడవురా` ఫ్లాప్ టాక్‌ని మూట‌క‌ట్టుకుంది. ఇక ఈ పండ‌గ‌ల‌ప్పుడు మెయిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటే సినిమానే అని చెప్పాలి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. దాంతో ఫుల్ క‌లెక్ష‌న్లు, ఓపెనింగులు వ‌చ్చాయిని చెప్పాలి. ఇక ఎటువంటి సంద‌డి లేకుండా ఉండ‌డం అంటే పండ‌గ అయిపోయి ఎవ‌రి ప‌నుల్లో వాళ్ళు బిజీ అయిపోవ‌డ‌మే.

సినిమా ఎంతో బావుంది అని హిట్ టాక్ వ‌స్తే త‌ప్పించి పండ‌గ త‌ర్వాత కూడా ఆ సినిమాని జ‌నం చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. కాస్త ఫేడ్ అవుడ్ టాక్ వచ్చినా డ‌బ్బులు పెట్టి కొనిమ‌రీ సినిమా చూసే రోజులు పోయాయ‌నే చెప్పాలి. ఈ విషయం పండగ తర్వాత విడుద‌లైన‌ డిస్కోరాజా చిత్రంతో మ‌న‌కు క్లియర్ కట్ గా అర్ధ‌మ‌వుతోంది. ర‌వితేజ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వ‌చ్చినా కాస్త డివైట్ టాక్ రావ‌డంతో క‌లెక్ష‌న్స్ ప‌డిపోయాయ‌నే చెప్పాలి. దానికి తోడు హాలీడేస్ అన్నీ అయిపోయి ఫుల్ బిజీ అయిపోవ‌డంతో జ‌నం థియేట‌ర్స్‌కి వెళ్ళి మ‌రీ సినిమా చూడ‌టం ప‌ట్ల పెద్దగా ఆశ‌క్తి చూప‌డం లేదు. ఇక దాంతో క‌లెక్ష‌న్స్ పై బాగానే దెబ్బ ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఎలాగైనా పండ‌గ హంగామా వేరు త‌ర్వాత సినిమా హ‌డావిడి వేరు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌రి డిస్కోరాజా సంగ‌తి ప‌క్క‌న‌పెడితే… నాగ‌శౌర్య న‌టించిన అశ్వ‌ధ్ధామ‌, చూసి చూడంగానే చిత్రాల ప‌రిస్థితేమ‌వుతుందో వేచి చూడాలి. ఇక ఈ విష‌యాన్ని క‌నిపెట్టిన నిర్మాత‌లు ఒక కీలక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ చిత్రాల‌ని కొన్ని థియేట‌ర్స్‌లో మాత్ర‌మే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.
ఒక వేళ సినిమా బావుంటే ఆ రిజ‌ల్ట్‌ని బ‌ట్టి థియేట‌ర్స్ పెంచుకునే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.