ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా అధికార వైసీపీ పార్టీ నుంచి అధికార పగ్గాలు చేపట్టిన నటుడు, కమెడియన్ పృథ్వీ ఆ తరువాత తన ఆఫీస్‌లో పనిచేసే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఎస్వీబీసీ ఛానల్ చైర్మప్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తనని ఓ పథకం ప్రకారమే తప్పించారని, దీని వెనక ప్రతి పక్ష టీడీపీ నేతల హస్యం వుందని, తను ఎలాంటి తప్పు చేయలేదని, ఇదొక ట్రాప్ అని పృథ్వీ వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.
తాజాగా పృథ్వీ మళ్లీ వార్తల్లో నిలిచారు. తన రాజకీయ ప్రసంగాలని కొంత మంది కావాలనే ఇష్టానుసారంగా ఎడిట్ చేసి ఆ వీడియోలని టిక్ టాక్‌లో పోస్ట్ చేస్తున్నారని, అన్ లైన్ వేదికగా తనని అవమానిస్తున్నారని నటుడు పృథ్వీ సోమవారం సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి కొంత మంది తన ఫొటోలని మార్ఫింగ్ చేసి కామెడీ పేరుతో తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నారని, అలా తనని అప్రతిష్ట పలు చేస్తూ రూపొందించిన వీడియోలని అన్నింటినీ ఆన్ లైన్ నుంచి తొలగించాలని, ఆ వీడియోలు పోస్ట్ చేసిన వారిని శిక్షించాలని పృథ్వీ పోలీసుల్ని ఆశ్రయించారు.
ఎస్వీబీసీ చైర్మన్‌గా వున్న సమయంలో ఓ మహిళతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడిన ఆడియో వయిస్ అతన్ని అన్ పాపులర్ చేసింది. ఐగా వైసీపీకి అండగా వుంటున్నాడని అతనికి అవకాశాల్ని కూడా ఇండస్ట్రీ ర్గాలు తగ్గించాయి. దీంతో పృథ్వీ ఏ నీ లేక కాలం వెల్లదీస్తున్నాడు.