ట్రైలర్ టాక్: అగ్గిరాజేస్తున్న మ‌గువ డేరింగ్ లైఫ్ స్టైల్

వెబ్ సిరీస్ అంటే యంగేజింగ్ కంటెంట్ తో అంత‌కంత‌కు ఉత్కంఠ పెంచాల్సిందే. లేదంటే డిజిట‌ల్ లో స‌క్సెస‌వ్వ‌డం అంత ఈజీ ఏం కాదు. ఎంచుకున్న కంటెంట్ లో ద‌మ్ముండాలి. అలా గొప్ప కంటెంట్ ఎంచుకున్నారు కాబ‌ట్టే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అంత పెద్ద స‌క్సెసైంది. ఈ సిరీస్ సెకండాఫ్ కోసం జ‌నం ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూశారు. ఈ సిరీస్ తీవ్ర‌వాదం నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది.

తాజాగా అమెజాన్ లోనే ఈనెల 17 నుంచి ప్ర‌సారం కానున్న ఓ హాట్ వెబ్ సిరీస్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇది కాస్త బోల్డ్ కంటెంట్ తో బెడ్ రూమ్ సీన్ల‌తో హీటెక్కించేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇంత‌కీ ఈ సిరీస్ టైటిల్ ఏమిటి? అంటే.. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ అనేది టైటిల్. తాజాగా ట్రైల‌ర్ ని రిలీజ్ చేసారు. ట్రైల‌ర్ ఆద్యంతం లిప్ లాక్ లు.. వేడెక్కించే బెడ్ రూమ్ సీన్లతో అదిరిపోయింది. అలాగ‌ని మ‌రీ గ‌తి త‌ప్పిన శృంగారం మాత్ర‌మే కాకుండా ఇందులో ఓ చ‌క్క‌ని సోష‌ల్ మెసేజ్ ఉంది. ఇక విడాకులు తీసుకున్న మ‌హిళ తాలూకా ఆలోచ‌న‌ల్ని .. అలాంటి మ‌హిళ‌ను స‌మాజం ఎలా ట్రీట్ చేస్తుంది? లాంటి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఈ సిరీస్ లో చ‌ర్చిస్తున్నారు. వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్ పోష్ క‌ల్చ‌ర్ లో న‌లుగురు అమ్మాయిల జీవ‌నం ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేలా డిజిట‌ల్ తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ సిరీస్ లో తొలి భాగం స‌క్సెసైంది. ఏప్రిల్ 17 నుండి రెండో సీజ‌న్ ప్రసారం కానుంది. సయాని గుప్తా, కీర్తి కుల్హారీ, బని జె, మాన్వి గాగ్రూ ప్రధాన పాత్రల్లో నటించారు.

Four More Shots Please - New Season Trailer | Sayani, Kirti Kulhari, Bani J, Maanvi Gagroo |April 17