Samantha : ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంతా ప్రభు వార్తల్లో కాస్త ఎక్కువగానే నిలుస్తుంది. మరి ఇప్పుడు పలు భారీ సినిమాలతో బిజీగా లైఫ్ ని కొనసాగిస్తున్న సమంతాకి ఓ నేషనల్ అవార్డు వరించింది. ఇక అసలు మేటర్ లోకి వెళితే సమంతా ఎన్నో అంచనాలు పెట్టుకొని నటించిన ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ హిట్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2”.
ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సమర్పించిన ఈ సిరీస్ ని రాజ్ అండ్ డీకే లు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో సమంతా బిగ్ స్క్రీన్ పై ఇవ్వని తన బెస్ట్ ని ఇచ్చింది అని చెప్పాలి. ఎన్నో బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించడమే కాకుండా అదిరిపోయే ఏక్షన్ సీక్వెన్స్ లు కూడా చేసి తనలోని మరో కోణాన్ని చూపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది.
మరి ఇదే తనకి ఫస్ట్ ఓటిటి ఎంట్రీ అయినా ఇప్పుడు దానికే నేషనల్ లెవెల్లో అవార్డు వరించింది. ఓటిటీలో బెస్ట్ ఫీమేల్ నటుల జాబితాలో సమంతాకి ఈ అవార్డు వచ్చినట్టుగా ప్రకటించారు. అయితే ఈ సిరీస్ లో సమంతా చేసిన కొన్ని మరీ హాట్ సీన్స్ వల్లే తనకి విడాకులు అయ్యాయని ఓ పుకారు ఉంది. ఇది ఎంత వరకు నిజమో కానీ ఓటిటి సిరీస్ లు అంటేనే ఇలాంటివి తప్పనిసరి సో ఏ విషయంలో ఆమెని తప్పుబట్టడానికి లేదు.