సమంత బాలీవుడ్ సినిమా చేయబోతోందన్న ప్రచారం ఈనాటిది కాదు. తనకు బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి లేదని గతంలో చెప్పిన సమంత, ఆ తర్వాత మనసు మార్చుకుంది. ఎప్పుడైతే, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ చేసిందో, ఆ తర్వాత బాలీవుడ్ మీద మమకారం సమంతకి మరింత పెరిగింది.
ఇటీవల నాగచైతన్యతో విడాకుల తర్వాత హిందీ సినిమాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది సమంత. పలు స్క్రిప్టులు కూడా విని, కొన్నిటికి సూత్రప్రాయంగా ఓకే చెప్పిందనే ప్రచారం జరిగింది. త్వరలో, అతి త్వరలో సమంత నుంచి ఓ బాలీవుడ్ సినిమాకి సంబంధించిన ప్రకటన రాబోతోందట.
అయితే, సమంత ఈ సినిమా కోసం కనీ వినీ ఎరుగని రీతిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందంటున్నారు. సమంతకి మామూలుగా వున్న డిమాండ్‌తో పోల్చితే, ఆమె అడిగిన రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అని అంటున్నారు. అయితే, సమంత అడిగినంత ఇచ్చేందుకు ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఓకే చెప్పిందని సమాచారం.
సమంత వరుసగా రెండు మూడు సినిమాలు బాలీవుడ్‌లో చేసే అవకాశం వుందట. అతి త్వరలోనే ఈ విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయని అంటున్నారు.