`బాహుబలి` తరువాత తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే సినిమాల నిర్మాణం బడ్జెట్ లెక్కలు కూడా పెరిగాయి. అదే స్థాయిలో టాలీవుడ్‌లో బినామీల హల్‌చల్ ఎక్కువైపోయింది. అసలు కంటే కొసరుకి ఉలుకెక్కువ అన్నట్టు.. రియల్ ప్రొడ్యూసర్ కంటే యాక్టింగ్ ప్రొడ్యూసర్‌లకు టెక్కు కాస్త ఎక్కువే అన్నట్టు టాలీవుడ్‌లో బినామీ ప్రొడ్యూసర్‌ల తీరు కనిపిస్తోంది. గత నాలుగేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి ఫ్రీలాన్సర్ ఫిల్మ్ జర్నలిస్టుగా, రివ్యూ రైటర్‌గా ఫిల్మ్ మీడియాలో ఎంటరైన ఓ వ్యక్తి ఇప్పుడు వరుసగా కోట్ల బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తూ హల్ చేస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఓ సాధారణ ఫిల్మ్ జర్నలిస్ట్ భారీ చిత్రాల్ని వన్ బై వన్ నిర్మిస్తుండటం ఎవరికీ అంతుచిక్కడం లేదట. అతని వెనకున్న రహస్యం ఏంటా అని ఆరాతీస్తే అతగాడు కొంత మంది పొలిటికల్ లీడర్స్‌కి బినామీ అని తేలింది. నాలుగేళ్ల క్రితం వచ్చి తెలుగు సినిమా స్వరూపాన్నే మార్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ చిత్రానికి పబ్లిసిటీ అండ్ పీఆర్ టీమ్‌గా పనిచేసిన సదరు ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ ఇప్పుడు బడా నిర్మాత, పంపిణీదారుడు కూడా అయ్యాడు. గతంలో కాగ్రెస్ పార్టీకి కీలక నేతగా వ్యవహరించి ఓ నాయకుడికి బండ్ల గణేష్ బినామీగా వ్యవహరించిన తరహాలోనే ఈ ఫ్రీలాన్సర్ ఫిల్మ్ జర్నలిస్ట్ కూడా కొంత మంది రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారికి బినామీగా వ్యవహరిస్తున్నాడట.
ఇటీవల జాతీయ స్థాయిలో అవార్టుని అందుకున్న ఓ నటితో ఇప్పుడు సదరు ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ ఓ మహిళా ప్రధాన చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అదీ కాకుండా ఇటీవల సొంత నిర్మాణ సంస్థలో హ్యుమన్ ట్రాఫికింగ్ ప్రధానంశంగా ఓ సినిమాని నిర్మించి చేతులు కాల్చుకున్న హీరోతో ఇటీవలే మరో చిత్రాన్ని ప్రారంభించాడు. దీంతో ఇంత డబ్బు ఎలా ఎక్కడి నుంచి వస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అతన్నిచూసి అవాక్కవుతున్నాయట.