నవ్వులు పూయించే కామెడీ షో జబర్దస్త్ కు విపరీతమైన క్రేజ్ నెలకొంది. విభిన్నమైన స్కిట్ లతో యువ కమెడియన్స్ బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నారు. జబర్దస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది న్యాయ నిర్ణేతలుగా నాగబాబు, రోజా.అన్ని షోల యందు జబర్దస్త్ షో వేరయా అన్నట్టుగా కామెడీతో కితకితలు పెట్టించే ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. ఈ కామెడీ షోకి గత కొన్నేళ్లుగా జడ్జ్‌గా వ్యవహరిస్తూ ఎక్స్ ట్రా ఫన్ అందిస్తున్న స్మైలీ హీరోయిన్ రోజా.. ఆ షోకి గుడ్ బై చెప్పేశారు. అధికార వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా నగరి ఎమ్మెల్యేగా పార్టీలో కీ రోల్ పోషిస్తున్న రోజా.. ఒకవైపు పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటూనే గురు, శుక్రవారాల్లో జబర్దస్త్ కామెడీకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోకి నాగబాబుతో కలిసి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న రోజా.. ఎన్నికల సమయంలో వీరి స్థానంలో చాలా మంది జడ్జ్‌లుగా వచ్చినప్పటికీ ప్రేక్షకులకు రోజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. చక్కని చిరునవ్వుతో పాటు ఇంట్రో సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేయడం రోజాలో ఉన్న స్పెషల్ అట్రాక్షన్. అయితే రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రోజా మినిస్టర్ కావడం ఖాయమని ఆమె జబర్దస్త్ కామెడీ షోకి స్వస్తిపలుకుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీనికి తగ్గట్టుగా రోజా కూడా ఫ్యామిలీని విజయవాడకు షిప్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే..ఈనాడు సంస్థలకు వెళ్ళవద్దని జగన్ రోజాకు సూచించినట్లు సమాచారం. అందుకే జబర్దస్త్ నుంచి ఫిబ్రవరి తర్వాత రోజా తప్పుకునే అవకాశం ఉందని కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రోజా జబర్దస్త్ టీమ్‌కు పోసాని కృష్ణమురళినే పర్మినెంట్ జడ్జ్‌గా నియమించమని సలహా ఇచ్చిందట. దీంతో మల్లెమాల టీమ్ మెంబర్స్.. నాగబాబు ప్లేస్‌ను పోసాని కృష్ణమురళితో పర్మినెంట్‌గా భర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారట. పైగా పోసాని కృష్ణమురళి కూడా రోజాకు చెందిన వైసీపి పార్టీకి చెందిన నేత. ఈ రకంగా రోజా తన పార్టీ వైసీపీకి చెందిన పోసాని కృష్ణమురళిని జబర్దస్త్ షోకు పర్మినెంట్ జడ్జ్‌గా ఈ సీటులో కూర్చోబెట్టిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరూ ఇలాగే కొనసాగిస్తారా లేదంటే బయటకి వెళ్లిపోతారా అన్నది తెలియాల్సి ఉంది.