తారక్, చరణ్ ని“Be The Men“ అంటున్న రాజమౌళి

Coronavirus

సందీప్ వంగ విసిరిన బీ ద మెన్ ఛాలెంజ్‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆదివారం స్వీక‌రించిన విష‌యం తెలిసిందే. త‌ను టాస్క్ కంప్లీట్ చేసి సోమ‌వారం త‌న వీడియోని పోస్ట్ చేస్తాన‌ని వెల్ల‌డించిన జ‌క్క‌న్న అన్న‌ట్టుగానే ఓ వీడియోని షేర్ చేశాడు. క‌రోనా కార‌ణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌తో పాటు జ‌న‌జీవితం మొత్తం స్పంభించిపోయింది.

నిత్యం బిజీ బిజీగా గ‌డిపే సినీ జ‌నాల‌కు మాత్రం ఈ క్వారెంటైన్ టైమ్ చాలా ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో ఎవ‌రికి తోచిన ప‌న‌లు వారు చేస్తూ ఎదుటి వారికి స‌వాల్ విసురుతున్నారు. తాజాగా ద‌‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ ఈ లాక్‌డౌన్ పిరియెడ్‌లో ప‌ని మ‌నిషి రాన‌ప్పుడు స‌తీమ‌ణికి స‌హాయం చేయాల‌ని, త‌న రోజు వారి ప‌నిని షేర్ చేసుకుని బీ ద మెన్ అనిపించుకోవాల‌ని రాజ‌మౌళికి స‌వాల్ విరిరాడు. దీన్ని స్వీక‌రించిన జ‌క్క‌న్న సోమ‌వారం ఓ వీడియోని పోస్ట్ చేశాడు.

సందీప్‌రెడ్డి వంగ కోరిన‌ట్టే ర‌మా రాజ‌మౌళికి ఇంటి ప‌నుల్లో స‌హాయంగా నిలిచి ఇంటి ఫోర్ని, డోర్ల‌ని, విండోస్‌ని శుభ్రం చేసిన రాజ‌మౌళి త‌న టాస్క్‌ని పూర్తి చేశాడు. అంతా ఊహించిన‌ట్టే తార‌క్‌‌, రామ్‌చ‌ర‌ణ్‌, కీర‌వాణితో పాటు ద‌ర్శ‌కుడు సుకుమార్‌ల‌కు ఛాలెంజ్ విసిరాడు. దీంతో తార‌క్‌, రామ్‌చ‌ర‌ణ్ ఎలాంటి వీడియోలు పెడ‌తారో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.