దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు కీరవాణి. జక్కన్న స్వయంగా కీరవాణికి తమ్ముడు న్న విషయం తెలిసిందే. ఏ సినిమా చేసినా సంగీత దర్శకుడిగా కీరవాణి వుండాల్సిందే. ఆ స్థానంలో మరొక సంగీత దర్శకుడు ఇప్పటి వరకు పని చేయలేదు. అంత బాడింగ్ ఇద్దరి మధ్య. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రానికి కూడా కీరవాణినే సంగీతం అందిస్తున్నారు.
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌తో 75 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో అంతా ప్రేక్షకులతో మాట్లాడాలని, ఆసక్తికరమైన విషయాల్ని పంచుకోవాలని సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానల్స్‌లో లైవ్ చిట్ చాట్‌లో పాల్గొంటున్నారు.
కీరవాణి కూడా ఓ టీవీ ఛానల్ లైవ్‌లో పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్న కీరవాణి రాజమౌళిలో తనకు నచ్చని విషయాల్ని ప్రత్యేకంగా బయటపెట్టడం ఆసక్తికరంగా మారింది. తను ఏదైనా అనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టడని అయితే తను ఇప్పటికీ చిన్న పిల్లల సినిమాలు చూస్తుంటాడని, అది తనకు ఇష్టముండదని, మెచ్యూర్డ్ సినిమాలు చూడాలని చెబితే వనడని అసలు సీక్రెట్ బయటపెట్టడం ఆసక్తిగా మారింది. దీనిపై రాజమౌళి ఎలాంటి సమాధానమిస్తాడో చూడాలి.